Banana Peel: సాధారణంగా మనకు అన్ని సీజన్లో లభించే పనులలో అరటిపండు ఒకటి. అరటిపండు మనకు ప్రతి ఒక్క సీజన్లోని ఎంతో విరివిగా లభిస్తుంది అలాగే అరటి పండ్లు తినడానికి చాలామంది కూడా ఇష్టపడుతుంటారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ అరటి పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అరటిపండు తినడం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. ఇక చాలా మంది అరటి పండు తిని తొక్క పడేస్తూ ఉంటాము.
ఇది ప్రతి ఒక్కరూ చేసే పని అరటిపండ్లు పూర్తిగా తినేసి తొక్కని విసిరేస్తుంటారు కానీ ఆ తొక్కలో ఉన్నటువంటి ప్రయోజనాలు కనుక తెలిస్తే ఎవరూ కూడా ఇకపై తొక్కలను అల విసిరి పారేయరనే చెప్పాలి. నిజానికి అరటిపండుతో పోలిస్తే అరటి పండు తొక్కలోనే మనకు ఎన్నో పోషక విలువలు చర్మ సౌందర్యాన్ని పెంపొందించే సహజ గుణాలు కూడా అందులో ఉన్నాయి. మరి అరటిపండు తొక్క వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయానికి వస్తే…
అరటిపండు తిన్నాక తొక్క లోపలి తెల్లటి భాగం గుజ్జుగా ఉంటుంది. దాన్ని తీసుకొని మోచేతులకి, మోకాళ్ళకి, కాళ్ళకి ఎక్కడైతే మనకు చర్మం కాస్త పొడి బారి, మొద్దు బారి నల్లగా ఉంటుందో అక్కడ రుద్దాలి.ఇలా చేయటం వల్ల చర్మంపై ఉన్నటువంటి మురికి తొలగిపోయి మృత కణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి తద్వారా చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే మొహంపై కూడా అరటి పండు తొక్కతో మసాజ్ చేయడం వల్ల కాంతివంతంగా చర్మం మెరుస్తుంది. ఇక బాగా తలనొప్పి ఉన్నవారు అరటిపండు తొక్కను ఐదు నిమిషాలు పాటు వేసుకోవడం వల్ల వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అరటిపండు తొక్క వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాలి.