Samantha-Kushi(2003) : సమంత ఖుషి సినిమా రూపంలో చైతూపై ప్రతీకారం తీర్చుకుంటుందా..? అంటే ప్రస్తుతం సినీ వర్గాలలో ఇదే మాట వినిపిస్తోంది. గాసిప్ రాయుళ్ళ మాట కూడా ఇదే. మజిలీ సినిమా తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి మళ్ళీ సినిమా చేయలేదు. ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతీ తెలిసిందే. ఈ సంఘటన తర్వాత అటు చైతూ అభిమానులు సమంతను, సమంత ఫ్యాన్స్ చైతూని సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ చేసిన సంగతీ తెలిసిందే.
చైతూ ఇవన్నీ తట్టుకున్నాడంటే ఓకే గానీ, సమంత వీటిని తట్టుకోవడం మళ్ళీ సినిమాలు ఒప్పుకోవడం వాటిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. విడాకుల తర్వాత సమంత ఒప్పుకున్న సినిమాలను చూస్తే, చైతూ మీద పట్టుదలతోనే ఇలా వరుసబెట్టి సినిమాలను కమిటవుతోందని మాట్లాడుకున్నారు. అయితే, సమంత బ్యాడ్ లక్ ఒక్క సినిమా కూడా మంచి హిట్ సాధించింది లేదు.
Samantha-Kushi(2003) : చైతూతో కలిసి డీసెంట్ పర్ఫార్మ్ చేసిన సామ్
ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాను పూర్తి చేసింది. ఇందులో హీరోతో కలిసి బాగానే రొమాన్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్..ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, సమంతలను చూసిన వారు ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుకుంటున్నారు. సమంత కావాలనే ఇంతగా రెచ్చిపోతుందా…? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మజిలీ సినిమాలో చైతూతో కలిసి డీసెంట్ పర్ఫార్మ్ చేసిన సామ్, ఇప్పుడు మాత్రం అందాల ప్రదర్శన బార్డర్ దాటేసిందని, ఇదంతా కేవలం నాగ చైతన్య మీద కోపంతోనే చేస్తుందని చెప్పుకుంటున్నారు.
ఒకవైపు విజయ్ దేవరకొండకి గతకొంతకాలంగా సరైన హిట్ లేదు. దర్శకుడికీ గత చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురికీ హిట్ తప్పనిసరి. ఖుషి సినిమా మీదే అందరూ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే అందరికీ బావుంటుంది. లేదంటే రక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సమంతను, నాగ చైతన్య అభిమానులు ఓ ఆట ఆడుకుంటారు.