Samantha : నేను హోటల్‌లో కూడా పనిచేశా..నా మొదటి సంపాదన రూ.500

Samantha : దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో సమంత రూత్ ప్రభు మొదటి వరసల ఉంటుంది . ఎవరి సహాయం లేకుండా టాలెంట్ తో స్వయం కృషితో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదిగింది ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్ నుంచి కాన్సెప్ట్ మూవీస్ తో పాటు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‎ను క్రియేట్ చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చే ఎంతో మంది హీరోయిన్లకు సమంత లైఫ్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. సినిమాల ద్వారా తాను సంపాదించిన సొమ్ములో కాస్త భాగాన్ని తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సేవా సంస్థ ద్వారా సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటుంది. ఒకరకంగా సమంత లైఫ్ తెరిచిన పుస్తకమే. ఓ వైపు సినిమాలు, మరోవైపు సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ భామకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా నెట్టింట్లో వైరల్ అవ్వాల్సిందే. ఇదిలా ఉంటే సమంత తాజాగా తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

samantha-intresting-comments-about-her-past-life

తెలుగు, తమిళం భాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా ఇబ్బంది పడుతోంది. ఈ విషయం బయటికి వచ్చినప్పటి నుంచి ఆమె కెరీర్ కాస్త డౌన్ అవుతూ వచ్చింది. అయినా సమంత వెనుదిరగలేదు. పట్టుదలతో ఆ వ్యాధినిసైతం ఓడించి మళ్లీ హీరోయిన్ గా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది. గత కొంత కాలంగా రెస్ట్ మోడ్ లో ఉన్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. సామ్ ఇప్పుడు మళ్లీ తన కెరీర్ ను ఓ గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతోందట. ఈ మధ్యనే సమంత , విజయ్ దేవరకొండతో జోడీ కట్టి ఖుషి అనే మూవీ చేసింది. ఈ మూవీ ఆవరేజ్ హిట్ అందుకుంది. ఇకపోతే తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందన్న న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్‎గా ఇన్‎స్టాగ్రామ్ వేదికగా సమంత తన చైల్డ్‎హుడ్ అనుభవాలను నెమరవేసుకుందట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన తాను ఒక పూట భోజనం కోసం కూడా కొన్ని సందర్భాల్లో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనను బాగా చదువుకోమని అమ్మానాన్న చెప్పేవారని గుర్తుచేసుకుంట. వారి మాట ప్రకారం కళాశాల విద్య వరకు చదువుకున్నానని, ఇంకా చదవాలని ఆశ ఉన్నా ఫ్యామిలీ పరిస్థితుల సహకరించలేదని తెలిపింది.

 

అందుకే అంది వచ్చిన ఏ పనినైనా చేశానని సమంత తన చిన్ననాటి పరిస్థితులను గుర్తు చేసుకుంది. కాబట్టి ఎవరైనా కలలు కనొచ్చని అయితే అవి ఆచరణ సాధ్యమైనవేనా అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలని తెలిపింది. ఇదే క్రమంలో ఓ నెటిజన్ మీ ఫస్ట్ ఇన్‎కమ్ ఎంత అని ప్రశ్నించాడు. ‘నేను చదువుకుంటున్న రోజుల్లో ఒకస్టార్‌ హోటల్‌లో నిర్వహించిన ఈవెంట్‌ కు యాంకర్ గా వ్యవహరించాను. అందుకోసం నాకు నిర్వాహకులు రూ. 500 చెల్లించారు. అదే తన తొలి సంపాదన అని సమంత రిప్లై ఇచ్చింది.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.