Fighter: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ్ ఆనంద్ నుంచి ఇంతకముందు వచ్చిన పఠాన్, వార్ చిత్రాలు భారీ విజయాలను అందుకోవడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇక ఇప్పటికే “ఫైటర్” సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ , సెకండ్ సాంగ్ కు నార్త్ అండ్ సౌత్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘హీర్ ఆస్మాని’ అంటూ సాగే మరో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సాంగ్ లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె డాన్స్ మూమెంట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఎయిర్ ఫోర్స్ పైలెట్ లుక్ లో హృతిక్ రోషన్ లుక్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.. అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మూవీ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఈ సాంగ్‌లో హృతిక్ రోషన్ డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయని నెటిజన్లు అంటున్నారు. హృతిక్ ఫిజిక్కు ఫిదా అయ్యామని చెబుతున్నారు. ఈ సాంగ్ హృతిక్ పాటల్లో వన్ ది బెస్ట్ అవ్వనుందని అంటున్నారు.
కాగా, “ఫైటర్” సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించనుండగా.. స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా (దీపికా పదుకొనే)గా కనిపించనున్నారు. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ సందడి చేయనున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.