Sai Pallavi : లేడీ పవర్ స్టార్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీ అయినప్పటికీ తెలంగాణ పిల్లలా అదరగొట్టి తన మాట, అందం, నటనతో అందరి మనసులను ఫిదా చేసేసింది. తెలుగులో ఈ భామ నటించింది కొన్ని సినిమాలే కానీ స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ బ్యూటీకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఎందుకంటే మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే సాయి పల్లవి కాస్త స్పెషల్ అని చెప్పాలి. ఎక్కడా స్కిన్ షో చేయదు. యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే ఎన్నుకుంటుంది. అందులోనూ హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉంటేనే ఓకే చెబుతుంది. దీంతో స్టార్ హీరోలు కూడా సాయి పల్లవితో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి. కేవలం నటనకే కాదు ఆమె డ్యాన్స్‌కు కూడా బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు,పెళ్లిళ్లు, విడాకులు, అఫైర్లు చాలా కామన్. ఎప్పుడు ఏ స్టార్ ఎవరితో రిలేషన్ లో ఉంటారో ఎప్పుడు బ్రేకప్ చెబుతారో ఎవరూ చెప్పలేరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇదే ట్రెండ్ ను సినీ స్టార్స్ ఫాలో అవుతుంటారు. ఇది వీరి వ్యక్తిగత విషయం కానీ సెలబ్రిటీలు కావడంతో వీరి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది తెగ ట్రై చేస్తుంటారు. మీడియా కూడా ఎప్పుడూ వీరిపై ఓ కన్నేసే ఉంటుంది. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట. ఆ స్టార్ కపుల్ విడిపోతుందట అంటూ రకరకాల రూమర్స్ రోజూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ కపులు ఆలియా భట్, రణ్ బీర్ ల పేరు చేరింది. వీరిద్దరూ త్వరలో డివోర్స్ తీసుకుంటారని రకరకాల కథలను వండుతున్నారు ట్రోలర్స్. అంతే కాదు వీరిద్దరిని నటి సాయి పల్లవి విడగొడుతుందంట. దీంతో ఈ న్యూస్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సాయిపల్లవి నటించిన తర్వాత పలువురు హీరోలు డివోర్స్ తీసుకున్నారు.
తమిళ మూవీ మారి 2లో హీరో ధనుష్ కు జోడీగా నటించింది సాయి పల్లవి. ఈ సినిమా తర్వా తనే ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కు డివోర్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే అక్కినేని నాగచైతన్న హీరోగా వచ్చిన లవ్ స్టోరీ మూవీలోనూ సాయి పల్లవి నటించింది. ఈ సినిమా తో వీరిద్దరి జోడీ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత నాగచైతన్య, సమంతకు డివోర్స్ ఇచ్చేశాడు. ఇక ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నితీశ్ తివారీ డైరెక్షన్ లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో నటిస్తోంది సాయి పల్లవి. దీంతో ఆలియా, రణ్‌బీర్ కూడా త్వరలో విడిపోవడం ఖాయం అంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
రామాయణం సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్, యష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నితీశ్ తివారీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో సీతగా సాయి పల్లవిని తీసుకున్నారని సమాచారం. అయితే ఈ మూవీకి సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది సాయిపల్లవి. కానీ, ‘రామాయణం’ సినిమాకు మాత్రం ఏకంగా 10 నుంచి 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మూవీ మూడు భాగాలుగా తెరకెక్కుతోందని టాక్. అందుకే సాయి పల్లవి పెద్ద మొత్తంలో వసూలు చేస్తుందని నెట్టింట హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.