Categories: EntertainmentLatest

Manchu Manoj : తండ్రైన మంచు మనోజ్..విష్ణు విషెస్ చెప్పాడా?

Manchu Manoj : టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తండ్రయ్యాడు. మనోజ్ బెటర్ హాఫ్ భూమా మౌనిక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా లో అనౌన్స్ చేసింది. దీంతో మనోజ్ మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. “మా ఇంటికి దేవత వచ్చింది. మనోజ్ కు పాప పుట్టింది. ఇప్పుడు మేం నలుగురుం అంటూ అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ రానే వచ్చేసింది. ఆ క్యూటీని మేము ఎంఎం పులి అని పిలస్తున్నాము. మా ఫ్యామిలీపై ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను. వారిని బ్లెస్ చేయండి”అని లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హ్యాపీ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇక మనోజ్‌కు పాప పుట్టడంతో మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే మంచు లక్ష్మీ మినహా మంచు కుటుంబం నుంచి ఇంకా ఎవరూ ఈ న్యూస్ పై రియాక్ట్ కాలేదు.

manchu-manoj-blessed-with-a-baby-girl

మంచు మనోజ్ భూమా మౌనికను లాస్ట్ ఇయర్ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. ఇదివరకే భూమా మౌనికకు ఓ బాబు ఉన్నాడు. ఇక మనోజ్ రెండో పెళ్లి తర్వాత ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి మనోజ్ విషయంలో అన్న విష్ణు దూరంగా ఉంటున్నాడు. మనోజ్ పెళ్లైన కొద్ది రోజులకే ఆయన ఇంటిపై మంచు విష్ణు దాడి చేసిన వీడియో అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. అయితే దీనిపై ఎవరూ స్పందించలేదు. మనోజ్ కూడా ఓ ఇంటర్వ్యూలో అన్నతో విభేదాలు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే దాటేశాడు. దీంతో మంచు ఫ్యామిలీలో విభేదాలు నిజమే అని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనోజ్ తన కెరీర్ పై దృష్టి పెట్టాడు. మళ్లీ సినిమాల్లో యాక్టివ్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. ఏడేళ్ల తరువాత ”వాట్ ది ఫిష్” అనే మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

manchu-manoj-blessed-with-a-baby-girl

”వాట్ ది ఫిష్” అనే మూవీతో వెండితెరకు కొత్త దర్శకుడు వరుణ్ పరిచియం అవుతున్నారు. ఈ సినిమాలో మనోజ్ తో పాటు పలువులు సినీ ప్రముఖులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా కనిపించనుంది. మనోజ్ – నిహారిక చాలా గ్యాప్ తరువాత చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ తమ అభిమాన తారలు బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Guava fruit: జామ పండు ఆరోగ్యానికి మంచిదే కానీ వీళ్ళు మాత్రం కాదండోయ్?

Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో…

8 hours ago

SSD Tokens Cancelled: శ్రీవారి భక్తులకు అలర్ట్..SSD టోకెన్లు రద్దు.. పూర్తి వివరాలివే!

SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…

8 hours ago

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

1 day ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

1 day ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

4 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

4 days ago

This website uses cookies.