Categories: EntertainmentLatest

Sai Pallavi : త్వరలో రణ్‌బీర్, ఆలియా డివోర్స్?.. సాయిపల్లవే కారణమా?

Sai Pallavi : లేడీ పవర్ స్టార్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీ అయినప్పటికీ తెలంగాణ పిల్లలా అదరగొట్టి తన మాట, అందం, నటనతో అందరి మనసులను ఫిదా చేసేసింది. తెలుగులో ఈ భామ నటించింది కొన్ని సినిమాలే కానీ స్టార్ హీరోయిన్‌ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ బ్యూటీకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఎందుకంటే మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే సాయి పల్లవి కాస్త స్పెషల్ అని చెప్పాలి. ఎక్కడా స్కిన్ షో చేయదు. యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే ఎన్నుకుంటుంది. అందులోనూ హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉంటేనే ఓకే చెబుతుంది. దీంతో స్టార్ హీరోలు కూడా సాయి పల్లవితో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి. కేవలం నటనకే కాదు ఆమె డ్యాన్స్‌కు కూడా బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

saisai-pallavi-is-the-reason-for-star-heroes-divorce

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు,పెళ్లిళ్లు, విడాకులు, అఫైర్లు చాలా కామన్. ఎప్పుడు ఏ స్టార్ ఎవరితో రిలేషన్ లో ఉంటారో ఎప్పుడు బ్రేకప్ చెబుతారో ఎవరూ చెప్పలేరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇదే ట్రెండ్ ను సినీ స్టార్స్ ఫాలో అవుతుంటారు. ఇది వీరి వ్యక్తిగత విషయం కానీ సెలబ్రిటీలు కావడంతో వీరి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది తెగ ట్రై చేస్తుంటారు. మీడియా కూడా ఎప్పుడూ వీరిపై ఓ కన్నేసే ఉంటుంది. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారట. ఆ స్టార్ కపుల్ విడిపోతుందట అంటూ రకరకాల రూమర్స్ రోజూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ కపులు ఆలియా భట్, రణ్ బీర్ ల పేరు చేరింది. వీరిద్దరూ త్వరలో డివోర్స్ తీసుకుంటారని రకరకాల కథలను వండుతున్నారు ట్రోలర్స్. అంతే కాదు వీరిద్దరిని నటి సాయి పల్లవి విడగొడుతుందంట. దీంతో ఈ న్యూస్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సాయిపల్లవి నటించిన తర్వాత పలువురు హీరోలు డివోర్స్ తీసుకున్నారు.

saisai-pallavi-is-the-reason-for-star-heroes-divorce

తమిళ మూవీ మారి 2లో హీరో ధనుష్ కు జోడీగా నటించింది సాయి పల్లవి. ఈ సినిమా తర్వా తనే ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కు డివోర్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే అక్కినేని నాగచైతన్న హీరోగా వచ్చిన లవ్ స్టోరీ మూవీలోనూ సాయి పల్లవి నటించింది. ఈ సినిమా తో వీరిద్దరి జోడీ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత నాగచైతన్య, సమంతకు డివోర్స్ ఇచ్చేశాడు. ఇక ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నితీశ్ తివారీ డైరెక్షన్ లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో నటిస్తోంది సాయి పల్లవి. దీంతో ఆలియా, రణ్‌బీర్ కూడా త్వరలో విడిపోవడం ఖాయం అంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

saisai-pallavi-is-the-reason-for-star-heroes-divorce

రామాయణం సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్, యష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. నితీశ్ తివారీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో సీతగా సాయి పల్లవిని తీసుకున్నారని సమాచారం. అయితే ఈ మూవీకి సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది సాయిపల్లవి. కానీ, ‘రామాయణం’ సినిమాకు మాత్రం ఏకంగా 10 నుంచి 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మూవీ మూడు భాగాలుగా తెరకెక్కుతోందని టాక్. అందుకే సాయి పల్లవి పెద్ద మొత్తంలో వసూలు చేస్తుందని నెట్టింట హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.