Sai Pallavi : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోయిన్ కు లేనంతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. తన డ్యాన్స్, నటనతో, న్యాచురల్ లుక్స్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగులో ఈ బ్యూటీ చేసిన చాలా వరకు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. గ్లామర్ రోల్స్ కాకుండా తన పాత్రకు ప్రాణం ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సృష్టించుకుంది సాయి పల్లవి. గార్గీ సినిమా తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది ఇఫ్పుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో బుజ్జితల్లిగా అలరించబోతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక ఇవాళ సాయి పల్లవి బర్త్ డే కావడంతో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి పల్లవి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.
తండేల్ మూవీని యంగ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ డ్యానర్ పై బన్నీ వాసు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే తండేల్ ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుంది. నాగ చైతన్య మూడవసారి చందూ మొండేటితో కలిసి పనిచేస్తున్నాడు. జాతీయవాద అంశాలతో కూడిన గ్రామీణ ప్రేమకథ ఈ తండేల్ సినిమా. ఈ మూవీలో సాయి పల్లవి చైతో జోడి కట్టింది. లవ్ స్టోరీ మూవీ తర్వాత వీరిద్దరూ మరోసారి తండేల్ లో కలిసి నటిస్తున్నారు.
వాస్తవానికి సాయి పల్లవి పుట్టిన రోజు కావడంతో తండేల్ నుంచి ఓ టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే మేకర్స్ కాస్త డిఫరెంట్ గా వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియోలో సాయి పల్లవి స్క్రీన్ బ్యాక్ ఎలా ఉంటుందో క్యూట్ మూమెంట్స్ ను షేర్ చేశారు మేకర్స్ సాయి పల్లవి తెలుగులో ఇప్పటివరకు చేసిన సినిమాల నుంచి కొన్ని ఫోటోలను, బుజ్జితల్లి షూటింగ్ స్పాట్ లోని అన్ ఎడిటెడ్ వీడియోలను తీసుకుని వీడియో తయారు చేశారు. నిజంగా ఈ వీడియో అదిరిపోయింది. సాయి పల్లవికి మరోసారి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.