RRR : చంద్రబోస్‌కు “నాటు నాటు” పాటతో అరుదైన గౌరవం..

RRR : ప్రముఖ సాహిత్య రచయిత చంద్రబోస్‌కు ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాసిన “నాటు నాటు” పాటతో అరుదైన గౌరవం దక్కింది. పాన్ ఇండియన్ చిత్ర దర్శకుడిగా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం) ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అవార్డులు దక్కించుకుంది. ఆస్కార్ అవార్డ్ నామినేషన్ వరకు వెళ్ళిన ఈ మూవీ ఖచ్చితంగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ అందుకుంటుందని తెలుగు సినీ ప్రేమికులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరూ ఆశిస్తున్నారు.

అయితే, ఇప్పటికే నాటు నాటు పాటకి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. అలాగే, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) పురస్కారం కూడా దక్కడమే కాక గొప్ప ప్రశంసల్ని అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పాట రాసిన సాహిత్య రచయిత చంద్రబోస్‌కి ప్రతిష్ఠాత్మక ‘ది సొసైటీ ఆఫ్ కంపోజర్స్ అండ్ లిరిసిస్ట్స్’ (ఎస్.సి.ఎల్) లో స్థానం దక్కడం మరో గొప్ప విశేషం. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రిల తర్వాత మన తెలుగు సినిమా పాటకి, సాహిత్యానికి ఈ గొప్ప గౌరవం.. గుర్తింపు తెచ్చిన మన భారతీయుడు చంద్రబోస్ కావడం గొప్ప విషయం.

rrr-A rare honor for Chandra Bose with the song “Natu Natu”.

RRR : ఇంత కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఈ పాటకి ఇన్ని అవార్డులు..ఇంత గౌరవం దక్కాయి.

ఒక భారతీయ చిత్రంలోని పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అవడం చరిత్రలో ఇదే మొదటిసారి. భారతీయ లేదా తెలుగు సినిమాల నుండి హాలీవుడ్ వాళ్లు సంగీత సాహిత్యాలు అనేది ఇది ప్రారంభం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్, ప్రేక్షకులు, అభిమానులు ‘నాటు నాటు..’కు డ్యాన్సులు చేయడం చూసి చంద్రబోస్ ఎంతో ఆనందంగా గడుపున్నారు. తెలుగు భాష అంతగా పరిచయం లేకపోయినప్పటికీ పాశ్చాత్య ప్రేక్షకులు కూడా ఈ పాటకు డాన్స్ చేస్తూ ఆనందపడుతున్నారు. విదేశీయులు ఇతర భారతీయ ప్రేక్షకులతో కలిసి నాటు నాటు పాటకి చేశారు. ఇది ఎంతో ఆసక్తికరమైన విషయం.

ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ పాట కోసం చంద్రబోస్ కేవలం 45 నిమిషాల సమయం మాత్రమే తీసుకున్నారట. చంద్రబోస్ – సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మొదటి రోజులోనే 90 శాతం పాట విషయంలో ఒక స్పష్ఠతకు రాగలిగారట. నాటు నాటు డ్యాన్స్ సీక్వెన్స్ ని చిత్రీకరించడానికి చాలా సమయమే పట్టిందట. చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి ఈ పాట రిహార్సల్ కోసం 30 రోజులు.. ఆతర్వాత పాట చిత్రీకరించడానికి మరో 30 రోజులు సమయం పట్టిందట. ఇంత కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఈ పాటకి ఇన్ని అవార్డులు..ఇంత గౌరవం దక్కాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Anand Devarakonda : అన్నను తొక్కేయాలని ఆ బ్యాచ్ ట్రై చేస్తోంది

Anand Devarakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ…

13 mins ago

Anikha Surendran : నేను మనిషినే..ట్రోలింగ్‎పై నటి ఎమోషనల్

Anikha Surendran : చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చింది అనిఖా సురేందరన్. తన క్యూట్ యాక్టింగ్ తో…

18 hours ago

White Onion: తెల్ల ఉల్లిపాయను తీసుకుంటున్నారా…. ఈ ప్రయోజనాలు మీ సొంతం?

White Onion: ప్రస్తుత కాలంలో ఉల్లిపాయలు లేనిదే ఏ ఆహారం తయారు చేయరు. ఉల్లిపాయను కేవలం ఆహార పదార్థాలను రుచిగా…

19 hours ago

Spirituality: శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా కింద పెట్టని వస్తువులు ఇవే?

Spirituality: మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో రకాల వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల…

19 hours ago

NTR Devara : పిచ్చెక్కిస్తున్న దేవర సాంగ్.. అనిరుథ్ అరిపించాడుగా

NTR Devara : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్. సీనియర్ హీరో తాత నందమూరి…

23 hours ago

Heeramandi Actress : ఫోన్ చేసి రమ్మంటారు..కానీ

Heeramandi Actress : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హీరామండి ది డైమండ్ బజార్ సిరీస్…

2 days ago

This website uses cookies.