Actress Ester Noronha: నా కెరీర్ లో ‘మాయ’ ఒక మైల్ స్టోన్..

Actress Ester Noronha: ఎస్త‌ర్ నోరోన్హా తాజా చిత్రం ‘మాయ’. ఈ సినిమాతో మనముందుకు మార్చ్ 15న రాబోతున్నారు ఎస్త‌ర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బారోమాస్’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘కయామత్ హి కయామత్’ అనే సినిమాలో అవకాశం అందుకున్నారు. ఈ రెండు సినిమాలతో హిందీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్ తెలుగులో స్టార్ డైరెక్టర్ తేజ రూపొందించిన ‘1000 అబద్ధాలు’ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.

దర్శకుడు తేజ ఇండస్ట్రీకి ఒక హీరోను గానీ, హీరోయిన్ ని గానీ పరిచయం చేశారంటే తప్పకుండా మంచి పర్ఫార్మర్ అని అందరూ చెప్పుకుంటారు. అదే మాట ఎస్తర్ గురించి ‘1000 అబద్ధాలు’ సినిమా చూసి చెప్పుకున్నారు. తన టాలెంట్, అందం గుర్తించిన స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేశ్ బాబు ఆయన నిర్మాణంలో వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. సునీల్ హీరోగా నటించిన ఈ మూవీకి ఉదయ శంకర్ దర్శకుడు. అనూప్ రుబెన్స్ సంగీత దర్శకుడు.

 

actress-ester-noronha-maya-is-a-milestone-in-my-career

Actress Ester Noronha: ‘మాయ’ అనే మరో డిఫరెంట్ సినిమాతో మనముందుకు

సుమారు 7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ 25 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఎస్తర్ కెరీర్ ప్రారంభంలో ఇలాంటి హిట్ దక్కడంతో అందరూ ఆమె గురించే మాట్లాడుకున్నారు. దాంతో తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, కొంకొణి భాషలలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల ‘భీమవరం బుల్లోడు’ సినిమా వచ్చి 10 ఏళ్ళు పూర్తైన సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు ఎస్తర్.

ఇక ‘సంస్కార్ కాలనీ’ లాంటి డిఫరెంట్ సినిమా చేసి ఇండస్ట్రీలో ఎలాంటి రోల్ అయినా ఎస్తర్ న్యాయం చేయగలదని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ‘మాయ’ అనే మరో డిఫరెంట్ సినిమాతో మనముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమా బాధ్యతను తన భుజాల మీద వేసుకొని ప్రేక్షకులకి ఈ సినిమా చేరువయ్యేలా కృషి చేస్తున్నారు ఎస్తర్.

actress-ester-noronha-maya-is-a-milestone-in-my-career

సాధారణంగా సినిమా అయ్యాక రెండు మూడు ఈవెంట్స్ లో కనిపించే స్టార్ హీరోయిన్స్ కి భిన్నంగా ఉన్న ఎస్తర్ ..’మాయ’ మూవీ ప్రమోషన్స్ లో అందరూ కొత్త వాళ్ళే..మీరు ఆదరిస్తే సినిమా హిట్ అయి అందరికీ మరో ఛాన్స్ వస్తుందని చెప్పడం ఇండస్ట్రీలో చాలామందిని ఆలోచింపజేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో అందరు ‘మాయ’ చిత్రాన్ని చూసి ఆదరించాలని..త్వరలో సక్సెస్ మీట్ లో కలుద్దాం అని చెప్పారు ఎస్తర్.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.