Fridge: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనకు ఫ్రిడ్జ్ కనిపిస్తూనే ఉంటుంది. మనం ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి పదార్థాలు తొందరగా పాడవకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసే అందులో నిలువ చేస్తూ ఉంటారు. పాలు, పెరుగు నుంచి మొదలుకొని కూరగాయలు వంటి వాటన్నింటినీ కూడా ఫ్రిజ్లో నిలువ చేసుకొని ఉంటారు ఇలా నిల్వ చేయటం వల్ల ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అయితే ఫ్రిడ్జ్ కూలింగ్ ఉంది ఆహార పదార్థాలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండాలి అంటే తప్పనిసరిగా ఫ్రిడ్జ్ మనం 24 అవర్స్ ఆన్ చేసి ఉండాలి.
అయితే చాలామంది ఫ్రిజ్ బాగా కూల్ అయిన తర్వాత రోజుకు ఒక గంట లేదా రెండు గంటల పాటు ఆఫ్ చేసి ఉంటారు ఇలా ఆఫ్ చేయటం వల్ల కరెంట్ చార్జెస్ తగ్గుతాయని భావిస్తూ ఉంటారు. అయితే ఇలా ఫ్రిడ్జ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిదేనా.. 24 గంటలు ఫ్రిజ్ ఆన్ లో పెడితే ఏదైనా సమస్యలు వస్తాయా అన్న సందేహాలు కూడా ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటాయి.
24 గంటలు పాటు ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టినప్పటికీ ఏ విధమైనటువంటి సమస్య ఉండదని చెబుతున్నారు ఫ్రిడ్జ్ తయారు చేసేటప్పుడు 24 గంటలు పని చేసే విధంగానే రూపొందించి ఉంటారు కనుక ఏ విధమైనటువంటి సమస్య ఉండదు.అలాకాకుండా మధ్య మధ్యలో ఒకటి లేదా రెండు గంటలు ఆఫ్ చేస్తే కనుక ఫ్రిడ్జ్ కూలింగ్ తగ్గిపోతుంది. తద్వారా లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడానికి కష్టం అవడంతో ఆహార పదార్థాలని చెడిపోయి దుర్వాసన వచ్చే పరిస్థితిలో ఉంటాయి కనుక 24 గంటల పాటు ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు.