Vitamins: ప్రస్తుత కాలంలో చాలామంది ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని చెప్పాలి గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసి రాత్రంతా ప్రశాంతమైన నిద్రపోయేవారు కానీ ప్రస్తుత కాలంలో రాత్రి పగలకు తేడా లేకుండా పోతుంది.
24 గంటలు పనులు చేస్తూనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది అయితే చాలామంది ఇలా వారి జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే మరికొందరు ఎప్పుడు నిద్రమత్తులోనే ఉంటూ ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అయితే ఇలా ఎప్పుడు నిద్రమత్తులో ఉన్నారు అంటే మీ శరీరంలో విటమిన్ ల లోపమే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఎప్పుడైతే విటమిన్ల లోపం ఉంటుందో ఆ క్షణం అలసట నీరసం ఒత్తిడిగా ఉండటం శరీరం బలహీనతకు గురి కావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ లోపం వల్ల తొందరగా అలసిపోవడం నిరసించి పోవడం నిద్రపోవాలనిపిస్తూ ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి అందుకే బి12 విటమిన్ దొరికే ఆహార పదార్థాలు మాంసం పండ్లు గుడ్లు పాల పదార్థాలను అధికంగా తీసుకోవడం మంచిది అలాగే విటమిన్ డి లోపం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.ఇలాంటి సమస్యలను దూరం పెట్టాలంటే విటమిన్లు పుష్కలంగా కలిగినటువంటి పదార్థాలను తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.