Tue. Jan 20th, 2026

    RC 15 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా క్రియేటివ్ జీనియస్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్సీ 15. ఇది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే. పరిశీనలో సీఈఓ అనే టైటిల్ ఉంది. ఇదే టైటిల్ గనక ఫిక్సైతే టైటిల్ సినిమాపై గ్యారెంటీగా భారీ అంచనాలను పెంచుతుంది. ఇక శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా ఓ పదేళ్ళ అడ్వాన్స్‌గా కథ కథనాలు ఉంటాయి.

    దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 10ఏళ్ళ తర్వాత ఎలాంటి మార్పులు సంభవిస్తాయో వాటిని ఇప్పుడే చూపించేస్తారు. ఓ దర్శకుడు ఇంత అడ్వాన్స్‌గా ఆలోచించి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ కథ ఎంచుకున్నా ఖచ్చితంగా అందులో సామాజిక అంశం ఉంటుంది. అదే శంకర్ కథా వస్తువు. ఆయన కెరీర్‌లో భారీ హిట్సే ఎక్కువ.

    rc-15-Choreography by Prabhudeva..Ram Charan, Kiara Dance
    rc-15-Choreography by Prabhudeva..Ram Charan, Kiara Dance

    RC 15 : రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఓ విజువల్ వండర్ లాంటి సాంగ్‌

    ఇలాంటి దర్శకుడు పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా అంటే అంచనాలను ఏ ఒక్కరూ ఊహించలేరు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఓ విజువల్ వండర్ లాంటి సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. దీనికి ఇండియన్ మైఖేల్ జాక్సన్, దర్శకుడు ప్రభుదేవా కొరియోగ్రఫీని అందించడం విశేషం.

    భారీ డాన్సర్స్ ఈ పాటలో పాల్గొంటున్నారు. ఈ ఒక్క పాటకే ఖర్చు కూడా బాగానే పెడుతున్నారట. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ సినిమాలో ఒక్కో సాంగ్ ఒక్కో విజువల్ వండర్‌లా ఉంటుంది. ఇప్పుడు ఆర్సీ 15 లో సాంగ్స్ వాటికంటే ఇంకో మెట్టు పైస్థాయిలో ఉండబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గనక పాన్ ఇండియన్ రేంజ్‌లో హిట్ సాధిస్తే ఇక అటు చరణ్ ఇటు శంకర్, దిల్ రాజుల రేంజ్ మరోలా ఉంటుందనడంలో సందేహమే లేదు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.