పీచుపదార్ధాలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే పండు అరటి పండు. ఇది ప్రతి ఒక్కరు తినే పండు. ఇది జీర్ణాశయానికి ఎంతో సహకరిస్తుంది. అందుకే చాలా మంది అరటి పండ్లను తమ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. పండు అరటిలోనే కాదు పచ్చి అరటిలోనూ ఆరోగ్యప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది పచ్చి అరటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. పిల్లలకు నచ్చేలా వారు ఇష్టంగా తినడానిక ఓ రెసీపీతో వచ్చేశాం. అ దే పచ్చి అరటి కాయ పొడి. ఇది ఒకసారి తింటే మళ్లి మళ్లి తినాలనిపిస్తుంది. సాంబార్ లేదా పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా దీనిని చేసుకోవచ్చు.
కేరళలో ఈ వంటకం చాలా స్పెషల్. దీనిని పది నిమిషాల్లో పూర్త చేయవచ్చు. కానీ ఎవరికీ పెద్దగా తెలియదు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అలా ఈ పచ్చి అరటి పొడి వేసుకుంటే ఉంటాది…నా సామి రంగా అంటారు .
కావాల్సిన పదార్ధాలు
పచ్చి అరటికాయ పెద్దది- 1
నూనె – 1 టేబుల్ స్పూన్
పసుపు – 1/4 టేబుల్ స్పూన్
ఉప్పు – సరిపడినంత
మసాలాకు :
శనగ పప్పు : 1 టేబుల్ స్పూన్
ధనియాలు : 1 టేబుల్ స్పూన్
కంది పప్పు : 2 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు : 3/4
పోపుకు :
నెయ్యి : 1 టేబుల్ స్పూన్
ఆవాలు : 1 టేబుల్ స్పూన్
మినపప్పు : 1 టేబుల్ స్పూన్
ఇంగువ : చిటికెడు
కరివేపాకు : మూడు రెమ్మలు
తయారీ విధానం :
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరిగించాలి. ఇప్పుడు పచ్చి అరటి కాయను తీసుకుని రెండు నుంచి మూడు ముక్కలుగా తొక్కతోనే కట్ చేసి మరుగుతున్న నీటిలో వేయాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసి మీడియమ్ హీట్ లో ఉడికించాలి. కుక్కర్లో కూడా ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు. అరటి కాయ బాగా ఉడికిన తరువాత స్టవ్‌ను ఆఫ్ చేసుకోవాలి. చల్లారే వరకు మూత పెట్టుకుని ఉంచాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత శనగపప్పు, ధనియాలు, కందిపప్పు, ఎండు మిరపకాయలు, వేసుకుని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. వీటిని మిక్సీ జార్ లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఉడికించిన పచ్చి అరటి ముక్కలను తొక్క తీసి వేళ్లతో మ్యాష్ చేయాలి. మరోసారి కడాయి పెట్టుకుని నెయ్యి వేసి వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తరువాత మినపప్పు, హింగ్, కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రాగానే అరటి గుజ్జును వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకుని మసాలా పొడిని వేసుకుని అంతా కలుపుకోవాలి. అంతే పచ్చి అరటికాయ పొడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెన్ని పోసుకుని మీరు ఎంజాయ్ చేయండి. ఫ్రిజ్‌లో రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు.