Rashmika-Vijay devarakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ పెద్ద గా వైరల్ అయిపోయింది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకుంటుందని ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని, ఎంగేజ్మెంట్ కు ప్లాన్స్ జరుగుతున్నాయని రకరకాల వార్తలు నెట్టింట్లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా రష్మిక విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కొన్ని పోస్టుల ద్వారా ఫాన్స్ కు దొరికిపోయింది కపుల్. ఇక అప్పటినుంచి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది.
గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ జంట అందరి ఫేవరెట్ అనే చెప్పాలి. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఖుషి మూవీ తో ప్రేక్షకులను అలరించాడు. సౌత్ స్టార్ బ్యూటీ సమంతకు జోడిగా నటించి తెరమీద సందడి చేశాడు. అంతకు ముందు లైగర్ డిజాస్టర్ తో ఇబ్బంది పడ్డ విజయ్ దేవరకొండ ఖుషి తో కాస్త కోలుకున్నాడనే చెప్పాలి. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్నారు రష్మిక లేటెస్ట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది .ఇదిలా ఉంటే ఈ జంటకు సంబంధించిన న్యూస్ ఏది వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. దీనికి తోడు అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్లో దిగిన ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతాయి. ఈ ఫోటోలు ఆ రూమర్స్ ను మరింత బలంగా మారుస్తాయి.
తాజాగా ఈ స్టార్స్ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. అంతే కాదు వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినట్టు టాక్. . ఫిబ్రవరి రెండో వారంలో ఎంగేజ్మెంట్ జరగనుందని అందుకు సంబంధించిన త్వరలో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ ఫేక్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. మరి కొంత మంది ఇది నిజమైతే బాగుండని అంటున్నారు. ఈ వార్తలపై విజయ్ టీం లేటెస్ట్ గా స్పందించింది. విజయ్, రష్మిక పెళ్లి గురించి వచ్చే న్యూస్ అంతా ఫేక్ అని దీనిని నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.