Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ లో దూసుకెళ్తోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. గత ఏడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించిన జవాన్ తో అమ్మడి క్రేజ్ బాలీవుడ్ లోకి పాకింది. తాజాగా నయనతార అన్నపూర్ణి అనే మూవీ చేసింది. ఇది నయనతార కెరీర్‌లో 75వ మూవీ.నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను మొదటి నుండి సమస్యలు వంెటాడుతున్నాయి. ఇకపోతే ఈ మధ్యనే ప్రముఖ ఓటీటీలో అన్నపూర్ణి విడులదైంది. ఆ తర్వాత కూడా మూవీకి చిక్కులు తప్పడం లేదు.ఈ సినిమాను చాలా మంది ఎంజాయ్ చేసినా కొంత మంది మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అన్నపూర్ణిలోని కొన్ని సీన్స్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఒక వ్యక్తి పోలీస్ ఆశ్రయించాడు. ఈ సినిమా విడుదల ముందే రాష్ట్రీయ హిందూ మహాసభ రాష్ట్రీయ ప్రతినిధి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా మళ్లీ అదే సమస్య ఎదురయ్యింది.
‘అన్నపూర్ణి’ సినిమాలో నయనతార ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. మూవీ ట్రైలర్ లోనే బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయని రాష్ట్రీయ హిందూ మహాసభ రాష్ట్రీయ ప్రతినిధి అభ్యంతరం వ్యక్తంచేశారు. అప్పుడే అన్నపూర్ణిని నిషేధించాలంటూ డిమాండ్ చేశారు. అవసరమైతే కోర్టు మెట్లు ఎక్కుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అక్కడితో ఆ గొడవ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ ఈ మూవీ రిలీజ్ కూడా అయ్యింది. యావరేజ్ టాక్‌తో అన్నపూర్ణి పరవాలేదనిపించింది. ఈ మధ్యనే ఓటీటీలో కూడా విడుదలయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార సినిమా స్ట్రీమ్ అవుతోంది. దీంతో మళ్లీ సమస్య మొదలైంది.
ఈ మూవీలో యాక్ట్ చేసిన నయనతారతో పాటు ఇతర మెంబర్స్ పైన కూడా తాజాగా ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందువులను మనోభావాలను దెబ్బతీస్తూ.. లవ్ జీహాద్‌ను ఎంకరేజ్ చేసేవిధంగా అన్నపూర్ణి సినిమా ఉందని శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి కేసు నమోదు చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా యాంటీ హిందు మూవీ అని కూడా పెద్ద స్టేట్‌మెంట్ పాస్ చేశారు. ఒక బ్రాహ్మణ అమ్మాయి క్యారెక్టర్ లో కనిపించిన నయనతార నాన్ వెజ్ కుక్ చేస్తుంది. అంతే కాదు వంటల పోటీల్లో వంట చేసేముందు నమాజ్ కూడా చేసే సీన్ ఈ మూవీలో ఉంది. సినిమాలోని ఈ సీన్స్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని రమేశ్ సోలంకి తెలిపారు. అంతే కాకుండా ఇందులో హీరోగా కనిపించిన జై.. రాముడిపై అభ్యంతరకర కామెంట్స్ చేశాడని అన్నారు. యూపీ, ముంబాయ్ పోలీసులు ఈ సినిమా మేకర్స్ పై యాక్షన్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే సినిమాపై ఇన్ని కాంట్రవర్సీలు వచ్చినా ఇప్పటి వరకు నయనతార గానీ, మూవీ టీమ్ కానీ స్పందించలేదు. చివరికి నెట్‌ఫ్లిక్స్ కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.