Rashmika-Vijay devarakonda : లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ పై ఇదిగో క్లారిటీ

Rashmika-Vijay devarakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ పెద్ద గా వైరల్ అయిపోయింది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకుంటుందని ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని, ఎంగేజ్మెంట్ కు ప్లాన్స్ జరుగుతున్నాయని రకరకాల వార్తలు నెట్టింట్లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా రష్మిక విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కొన్ని పోస్టుల ద్వారా ఫాన్స్ కు దొరికిపోయింది కపుల్. ఇక అప్పటినుంచి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది.

rashmika-vijay-devarakonda-engagement-is-a-fake-news

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ జంట అందరి ఫేవరెట్ అనే చెప్పాలి.  ఈ మధ్యనే విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి మూవీ తో ప్రేక్ష‌కులను అలరించాడు. సౌత్ స్టార్ బ్యూటీ సమంతకు జోడిగా నటించి తెరమీద సందడి చేశాడు. అంతకు ముందు లైగర్ డిజాస్టర్ తో ఇబ్బంది పడ్డ విజయ్ దేవరకొండ ఖుషి తో కాస్త కోలుకున్నాడనే చెప్పాలి. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్నారు రష్మిక లేటెస్ట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది .ఇదిలా ఉంటే ఈ జంటకు సంబంధించిన న్యూస్ ఏది వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. దీనికి తోడు అప్పుడ‌ప్పుడు వీరిద్దరూ క‌లిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతాయి. ఈ ఫోటోలు ఆ రూమర్స్ ను మరింత బలంగా మారుస్తాయి.

rashmika-vijay-devarakonda-engagement-is-a-fake-news

తాజాగా ఈ స్టార్స్ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. అంతే కాదు వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినట్టు టాక్. . ఫిబ్రవరి రెండో వారంలో ఎంగేజ్‌మెంట్‌ జరగనుందని అందుకు సంబంధించిన త్వరలో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ ఫేక్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. మరి కొంత మంది ఇది నిజమైతే బాగుండని అంటున్నారు. ఈ వార్తలపై విజయ్ టీం లేటెస్ట్ గా స్పందించింది. విజయ్, రష్మిక పెళ్లి గురించి వచ్చే న్యూస్ అంతా ఫేక్ అని దీనిని నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.