Rashmika Mandanna : పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రష్మిక మందన్న. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ లెవెల్లో పెరిగిపోయింది. అప్పటి వరకు సౌత్ సినిమాల్లోనే నటించిన రష్మిక, పుష్ప తర్వాత బాలీవుడ్‌లోనూ అవకాశాలు తలుపుతట్టాయి. పలు సినిమాల్లో నటించినప్పటికీ తాజాగా విడుదలైన యానిమల్ మూవీ అమ్మడికి మంచి హిట్ అందించింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో బాలీవుడ్ యువ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ సినిమాలో గీతాంజలి క్యారెక్టర్ కు నూటికి నూరు శాతం న్యాయం చేసింది రష్మిక. దీంతో యానిమల్ సీక్వెల్ లోనూ ఛాన్స్ కొట్టేసింది. అయితే తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో యానిమల్ షూటింగ్ లో తన అనుభవాల గురించి పంచుకుంది. మరీ ముఖ్యంగా యానిమల్ లోని ఓ సీన్ తనను బాగా ఏడిపించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..”యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో యాక్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి థింకింగ్ కెపాసిటీ చూసి షాక్ అయ్యాను. ఈ మూవీలో రణ్‌బీర్ భార్యగా ఆయన్ని చెంప దెబ్బ కొట్టే సీన్ నటిగా నాకొక ఛాలెంజింగ్ గా అనిపించింది. నిజం చెప్పాలంటే ఒక్క టేక్‌లోనే ఆ సన్నివేశం పూర్తి చేశాం. డైరెక్టర్ సీన్ ను వివరించి పరిస్థితిని ఫీలవ్వాలని చెప్పారు. ఆ మాటే నా మైండ్ లో ఉంది. షూట్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత యాక్షన్, కట్ మాత్రమే గుర్తుంది. మధ్యలో ఏం జరిగిందో అసలు గుర్తే లేదు. సీన్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యాను. రణ్‌బీర్ మీద గట్టిగా అరిచేశాను. కోపంతో చెంపపై కొట్టాను. షాట్ ఓకే అని సందీప్ చెప్పినా నా ఎమోషన్స్ కంట్రోల్ కాలేదు. కంట్లో కన్నీళ్లు ఆగలేదు. ఆ సీన్ లో మాత్రం బాగా ఏడ్చేశాను. సీన్ పూర్తైన తర్వాత రణ్‌బీర్ దగ్గరకువెళ్లి..అంతా ఓకేనా అని అడిగాను. అలా యానిమల్ సినిమాలో ఆ సీన్ లో బాగా ఏడ్చేశాను అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. యానిమల్ సెకెండ్ పార్ట్ విషయంలో సందీప్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మొదటి భాగానికి మించి రెండో భాగం ఉండబోతోంది”.అని రష్మిక తన అనుభవాలను పంచుకుంది.
ఇదే ఇంటర్వ్యూలో పుష్ప2 గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రష్మిక. ” పుష్ప 2 గురించి మీరు ఉహించిన దానికంటే భారీ స్థాయిలో ఉంటుంది. పుష్ప విజయం మాలో బాధ్యతను మరింత పెంచింది. ఈమధ్యే ఒక పాట షూట్ చేశాము. ఇది ముగింపు లేని కథ.పుష్ప 2 విషయంలో నాపై ఎలాంటి స్ట్రెస్ లేదు. ఇందులో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆగష్టు 15న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అవుతుంది. పుష్ప 2 తో పాటు శేఖర్ కమ్ముల, ధనుష్ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నా” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.