Wed. Jan 21st, 2026

    Rashmika Mandanna : నేషనల్ క్రష్‌గా పిలుచుకుంటున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జీవితం గురించి తన అనుభవాలను ఓ కొటేషన్ రూపంలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చెప్పిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు పరిశ్రమకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇక్కడ స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాపైనా కూడా ఆ ప్రభావం ఈ కన్నడ భామపై ఏమాత్రం పడలేదు.

    rashmika-mandanna- philosophy so attractive..it is becoming so viral on social media
    rashmika-mandanna- philosophy so attractive..it is becoming so viral on social media

    ఇక కాంట్రవర్సీలు ఉన్నాయి. విజయ్ దేవరకొండతో డీప్ లవ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు శికార్లు చేస్తున్నాయి. ఏదేమైనా రష్మిక ఎప్పుడూ వాటిని చాలా పాజిటివ్‌గానే తీసుకుంది. స్కిన్ షో చేస్తుందనే కామెంట్స్ వచ్చినా..వీళ్ళతో వాళ్ళతో డేటింగ్‌కి వెళుతుందని చెప్పుకున్నా లైట్ తీసుకుంది. ఎందుకంటే ఉన్నదే చాలా చిన్న జీవితం. దాన్ని హాయిగా ఎంజాయ్ చేయకుండా చెత్త ఆలోచనలతో బుర్ర పాడుచేసుకోవడం ఎందుకనేది రష్మిక మందన్న అభిప్రాయం.

    Rashmika Mandanna : ఓ అద్భుతమైన కొటేషన్‌గా మార్చి చెప్పింది.

    దాన్నే ఇప్పుడు ఓ అద్భుతమైన కొటేషన్‌గా మార్చి చెప్పింది. ‘సంతోషంగా ఉండండి.. ఆశతో జీవించండి. మీ సంతోషం ప్రశాంతత అన్నింటికంటే చాలా ఎక్కువ. ప్రతికూల భావాలను (నెగిటివ్ ఫీలింగ్స్) విడిచిపెట్టండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది..అంటూ అమ్మడు ఫిలాసఫర్‌గా సెలవిచ్చింది. ఇది కేవలం రష్మిక అభిమానులకే కాదు, నెటిజన్స్‌కి కూడా తెగ నచ్చేసింది. అందుకే ఈ కొటేషన్‌కి ఎన్నో రిప్లయ్స్ వస్తున్నాయి. అవన్నీ పాజిటివ్‌గా ఉండటం ఆసక్తికరం.

    ఇక రష్మిక మందన్న బాలీవుడ్‌లో అడుగుపెట్టి హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీదుంది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. పార్ట్ 1లో శ్రీవల్లి పాత్రలో డీ గ్లామర్ రోల్ చేసి అన్నీ భాషలలో మెప్పించింది. ఆ క్రేజ్‌తో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిన సంగతి అందరికీ తెలిసిందే.

     

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.