Wed. Jan 21st, 2026

    HBD Rashmika సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అనే బ్రాండ్ ఇమేజ్ ని ప్రస్తుతం సొంతం చేసుకుంది. హిందీలో కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలు కంప్లీట్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రణబీర్ కపూర్ కి జోడీగా యానిమల్ సినిమాలో నటిస్తుంది. ఇక తెలుగులో పుష్ప2 సినిమాలో నటిస్తుంది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. సౌత్ ఇండియా స్టార్ అయిన కూడా దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న టాప్ హీరోయిన్స్ లో రష్మిక కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. క్రికెటర్స్ కి కూడా క్రష్ గా రష్మికగా మారిపోయింది అంటే ఆమె ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుందో అర్ధం చేసుకోవచ్చు.

    Birthday Special: 5 must-watch multilingual films of Rashmika Mandanna

    కన్నడంలో మొదటి సినిమా అవకాశం రష్మికకి వచ్చింది కిరీక్ పార్టీలో ఆమె మొదటిగా నటించింది. ఆ సినిమాలో ఛాన్స్ వచ్చే సమయానికి ఆమె చదువుకుంటుంది. మొదటి సినిమా సక్సెస్ కావడంతో రెండో సినిమాని ఏకంగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో అంజనీపుత్ర అనే సినిమాలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత చలో మూవీతో టాలీవుడ్ లోకి ఈ అమ్మడు అడుగుపెట్టి మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. తరువాత గీతాగోవిందం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. అనంతరం భీష్మతో మరో హిట్ ని ఖాతాలో వేసుకుంది.

    Check Out: Rashmika Mandana Looks Stunning In Printed Traditional Ensemble  On Social Media | IWMBuzz

    దాంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సూపర్ స్టార్ మహేష్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక పుష్ప మూవీ అయితే ఆమెకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. ఇక ఈమె కెరియర్ లో నటిగా సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంది. ఇక వ్యక్తిగత జీవితంలో ఆమె మీద చాలా వివాదాలు వచ్చాయి. మొదటి సినిమా హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్ధం కూడా చేసుకున్న రష్మిక తరువాత స్టార్ హీరోయిన్ గా సక్సెస్ లు వస్తూ ఉండటంతో పెళ్లి వాయిదా వేసుకుంది. మళ్ళీ ఏమైందో అతనితో బంధం తెంచుకుంది. అదే సమయంలో మొదటి సినిమా దర్శకుడు రిషబ్ శెట్టితో కూడా ఆమెకి మంచి రిలేషన్ లేదు. ఇక గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు విజయ్ దేవరకొండతో చేయడంతో ఇద్దరు డేట్ లో ఉన్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది.

    Rashmika Mandanna Birthday: साउथ की हाईएस्ट पेड एक्ट्रेस हैं रश्मिका  मंदाना, छोटी उम्र में ही बन गई थीं नेशनल क्रश - Entertainment - GNT

    అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్న కూడా విజయ్ తో రష్మిక రిలేషన్ లో ఉందనే నమ్ముతున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తో రిలేషన్ పెట్టుకొని విజయ్ కి రష్మిక బ్రేక్ అప్ చెప్పేసింది అనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇకా సెలబ్రిటీ లైఫ్ లో హీరోయిన్స్ పై ఉండే రూమర్స్ ఎప్పుడు కూడా రష్మిక మీద వినిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా నితిన్ తో ఒక సినిమాకి ఈమె కమిట్ అయ్యింది. అలాగే రెయిన్ బో తో ఫిమేల్ సెంట్రిక్ మూవీని కెరియర్ లో మొదటి సారి ఒప్పుకుంది. దీంతో పాటు హిందీలో కూడా ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ వస్తుండటం విశేషం.