Ram Charan: పెద్ది ఐటం సాంగ్ కోసం ఇంతమంది స్టార్ హీరోయిన్సా?

Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే ఐటం సాంగ్‌లో స్టార్ హీరోయిన్ గనక హీరోతో కలిసి స్టెప్పులేస్తే థియేటర్స్‌లో అభిమానులు చేసే హంగామా నెక్స్ట్ లెవల్. అందుకే, మన ఫిల్మ్ మేకర్స్ ఒక్కో స్పెషల్ నంబర్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. మాస్ సాంగ్ అంటే మేకర్స్ కూడా దేనికి వెనకాడటం లేదు. ఇప్పుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ మూవీ కోసం ఇలాంటి సాంగ్ ఒకటి ప్లాన్ చేశారు.

ఈ సాంగ్ ఒక్కటీ కంప్లీట్ అయితే పెస్సి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. రెహమాన్ సంగీతం అదిస్తున్నాడు. ఇప్పటికే, ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను ఏ స్థాయిలో పెంచిందో అందరికీ తెలిసిందే. బుచ్చిబాబు అనుకున్న కథలో చరణ్ ఎంతో లీనమై నటించాడు. అంతేకాదు, ఎంతో రిస్క్ చేసిన సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. దీనిలో భాగంగానే ఓసారి చరణ్ కి కన్ను గాయమైంది.

ram-charan-so-many-star-heroines-for-a-peddi-item-song

Ram Charan: చరణ్ ఏదీ లెక్కచేయకుండా పెద్ది సినిమాను పూర్తి చేశాడు.

అయినా, చరణ్ ఏదీ లెక్కచేయకుండా పెద్ది సినిమాను పూర్తి చేశాడు. ఒక్క, ఐటం సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ప్రస్తుతం సెకండాఫ్ కి సంబందించిన డబ్బింగ్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న రిలీజ్ అనుకున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మళ్ళీ పోస్ట్ పోన్ తప్పదనిపిస్తోంది. మళ్ళీ, ఎప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారో అనే ఆతృత అందరిలోనూ ఉంది.

మరోవైపు పెద్ది మూవీలో ఉన్న స్పెషల్ నంబర్ లో చరణ్ సరసన స్టెప్పులేసే హీరోయిన్ గురించి రక రకాల వార్తలు, పేర్లు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల, మృణాల్ ఠాకూర్, సమంత, మానస వారణాసి..ఇలా పలువురు క్రేజీ గ్లామర్ బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. మరి, ఆ లక్ ఎవరికి దక్కుతుందో తెలీఉ గానీ, ఈ సాంగ్ మాత్రం సినిమాకి చాలా హైలెట్ అని అంటున్నారు. సుకుమార్ సినిమాలలో ఐటం సాంగ్స్ ఎలా ఉంటాయో రంగస్థలం, పుష్ప సినిమాలలో చూశాము. ఇప్పుడు, పెద్ది మూవీలో అన్నిటికంటే హైరేంజ్ లో ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని చెబుతున్నారు. చూడాలి, ఈ సాంగ్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

6 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

6 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.