P. Sunil Kumar Reddy: మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్.!

P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా దర్శకుడు పక్కా కమర్షియల్ కథలనే ఎంచుకుంటుంటాడు. అగ్ర దర్శకుల జాబితాలో చేరాలంటే ఫక్తు కమర్షియల్ ప్లాట్ పట్టుకొనే హీరోలను, నిర్మాతలను మెప్పించి ఒప్పిస్తుంటారు. కొత్తగా ఉండస్ట్రీకొచ్చే దర్శకులు ఎంతమత్రం ప్రయోగాలు చేయడానికి సిద్ధపడరు. ఓ లవ్ స్టోరీనో..మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాన్నో, లేక కుటుంబ కథా చిత్రాన్నో ఎంచుకుంటుంటారు. అలాంటి, వారందరికీ భిన్నంగా ఉండే రచయిత, దర్శకుడు, నిర్మాత పి.సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు, ఆయన మరోసారి ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ఏదో వివరాల్లోకి వెళ్ళి చూద్దాం.

మన సమాజంలో తమకంటూ ఎలాంటి హక్కులు లేకుండా..ప్రతీ ఒక్కరితో అవమానాలు, చీదరింపులు, హేళనలకి గురౌతున్నవారు ట్రాన్స్‌జెండర్స్(హిజ్రాలు). ఎన్నో ఏళ్లగా వీరు సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. తమ హక్కులు – సమానత్వం కోసం ఈ వర్గం పోరాడుతోంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి.. వర్షిణి అనే ట్రాన్స్‌జెండర్‌ను తన పీఏగా నియమించి, ఆదర్శంగా నిలవడం గొప్ప పరిణామం. ఇలాంటి, సున్నితమైన అంశాన్ని కథా వస్తువుగా తీసుకున్నారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి.

p-sunil-kumar-reddy-the-bold-director-is-getting-ready-for-another-experiment

P. Sunil Kumar Reddy: P. సునీల్ కుమార్ రెడ్డి మాత్రం తన పంథాను మార్చుకోలేదు.

ఈ దర్శకుడు పేరు చెప్తేనే సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, నేనేం చిన్నపిల్లనా.. లాంటి చిత్రాలు గుర్తొస్తాయి. ఈ సినిమాలన్నీ రూపొందింది కమర్షియల్ ఫార్మాట్ లో కాకపోయినా కూడా మంచి విజయాలను అందుకున్నాయి. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. పాన్ ఇండియా సినిమా అంటూ పెద్ద పెద్ద స్టార్స్‌తో వందల కోట్ల ఖర్చు చేసి సినిమాలు తీసి దారుణంగా నష్టపోతున్న నిర్మాతలున్న విషయం ఒప్పుకొని తీరాల్సిందే. కానీ, 20కి పైగా సినిమాలు రాసి, తీసి, నిర్మించిన సునీల్ కుమార్ రెడ్డి మాత్రం ఆయన పంథాను మార్చుకోలేదు. ఈ ఏడాది మార్చిలో కాక్రోచ్ అనే చిత్రంతో వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

ఇక, ప్రస్తుతం ఆయన ఎల్.జి.బి.టి (LGBT A Legal Battle) అనే సినిమాను రూపొందించారు. ట్రాన్స్‌జెండర్‌ల జీవితాలను వెండితెరమీద ఆవిష్కరించబోతున్నారు. ఇందుకోసం ఆయన ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్‌లనే ఎంచుకున్నారు. అనుపమ్ ఖేర్, సీనియర్ నటుడు, రచయిత ఎల్.బి.శ్రీరామ్, ఆనంద చక్రపాణి, ఎస్తర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ మూడవ వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ సునీల్ కుమార్ రెడ్డి నుంచి వచ్చిన సినిమాలన్నీ సమాజిక అంశంతో ముడిపడి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నవే. మరి, త్వరలో రాబోతున్న ఎల్.జి.బి.టి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో..ఎన్ని ప్రశంసలు దక్కించుకుంటుందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.