Categories: DevotionalLatestNews

Puranapanda Srinivas: ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి, సొంత డబ్బాలకు దూరంగా ఉండే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఒకే రోజు మూడు మహాక్షేత్రాలను దర్శించి పరవశించిపోవడాన్ని ఆయా ఆలయాల అర్చక, వేద పండిత బృందాలు అభినందిస్తూ చర్చించుకోవడం విశేషం.

ఉదయం భద్రాద్రి సీతారామ చంద్రుల కల్యాణ మహోత్సవంలో పురాణపండ శ్రీనివాస్ పాల్గొని అక్కడి పండిత వర్గాలతో కాస్సేపు వైదికమయ వైష్ణవ విశేషాల్ని ముచ్చటించడం ఒక ప్రత్యేక పవిత్రతగా చెప్పక తప్పదు. సాయంకాలం యాదాద్రి లక్ష్మీ నారసింహుని దర్శనానికి వెళ్లిన పురాణపండకు, ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయానుసారం ఘన స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించి లాంఛనప్రాయంగా మంటపంలో వేదపండిత ఆశీర్వచనాలు వర్షించడం యాదాద్రి నారసింహుని కటాక్షమేనని చెప్పాలి.

puranapanda-srinivas-bhadrachalam-kalyanam-yadadri-darshan-news

Puranapanda Srinivas: వందేళ్లకు పైగా ఎన్నెన్నో మహిమల అద్భుత చరిత్ర

వందేళ్లకు పైగా ఎన్నెన్నో మహిమల అద్భుత చరిత్ర గలిగిన భాగ్యనగరంలోని మహావీర్ హనుమాన్ మందిర్‌ని ఇదే రోజు రాత్రి పురాణపండ శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజరంగబలి హనుమాన్ కోకొల్లల వరాల వైభవాల్ని ఈ సందర్భంలో మార్వాడీ బ్రాహ్మణ పూజారులు పురాణపండ శ్రీనివాస్‌కు స్పష్టంగా వివరించడం మీడియాకు దర్శనమిచ్చింది. పురాణపండ శ్రీనివాస్ వెంట ఉన్న అనుచర సహచరులు ఈ మూడు ఆలయాల ధర్మకర్తలకు, పూజారులకు, వేదపండితులకు శ్రీనివాస్ రచనా సంకలనాలను అందజేశారు.

మరొకప్రక్క తానొక్కడై ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నిర్విరామంగా, నిస్వార్ధంగా చేస్తున్న ఆర్ష ధార్మిక ఉద్యమం తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకే కాకుండా అనేక రాష్ట్రాలను దాటి దేశ దేశాల తెలుగు వారికి చేరడం గర్వకారణమని మహా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు రమణాచారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి అధికారులు సైతం అనేక సభల్లో గొంతెత్తి ప్రశంసల ఆశీస్సులు వర్షించడం ప్రత్యేకంగా పేర్కొనాల్సిందే !

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.