Wed. Jan 21st, 2026

    Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత నాలుగేళ్ళుగా అటు ఆర్ఆర్ఆర్ ఇటు ఆచార్య సినిమాల కోసం రెండు రకాల లుక్స్ మేయిన్‌టైన్ చేస్తూ వచ్చారు మెగా పవర్ స్టార్. ఇటీవల నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ కూడా అందుకున్న విషయం తెలిసిందే. అయితే, క్రియేటివ్ జీనియస్ శంకర్, చరణ్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు.

    కియారా అద్వానీ హీరోయిన్‌గా.. అంజలి, శ్రీకాంత్, రాహుల్ రవీంద్రన్, జయరాం లాంటి పాపులర్ స్టార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దిల్ రాజు-శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకీ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే, గతంలో ఆర్సీ 15 నుంచి చరణ్ లుక్ ఒకటి లీకై నెట్టింట తెగ వైరల్ అయింది. ఆ లుక్ చూసిన అందరూ ఏజ్ ఎక్కువ కలిగిన పాత్రలో కనిపించబోతున్నారని చెప్పుకున్నారు.

    ram-charan in an unexpected look.. Shankar's getup in the movie went viral
    ram-charan in an unexpected look.. Shankar’s getup in the movie went viral

    Ram Charan : చరణ్ లుక్ చూసి షాకవుతున్నారు.

    ఇప్పుడేమో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చారు రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇటీవల రంగమార్తాండ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించి ప్రశంసలు అందుకుంటున్న సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మానందని సత్కరించారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చరణ్ సైడ్ క్రాఫ్ చేయించుకొని ఆర్మీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి గెటప్‌లో చరణ్ కనిపించలేదు.

    దాంతో మెగా అభిమానులు, ప్రేక్షకులు చరణ్ లుక్ చూసి షాకవుతున్నారు. ఖచ్చితంగా శంకర్ సినిమాలో చరణ్ పోషించే పాత్ర హైలెట్ కావడం పక్కా అని చెప్పుకుంటున్నారు. ఏకంగా మెగా అభిమానులైతే చరణ్ న్యూక్‌ను తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసుకుంటూ బాగా వైరల్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ మూవీకి సీఈవో అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.