Rakul Preet Singh: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయిన హిందీలో మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది.
గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే వాటిలో ఏవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. అయినా కూడా హిందీలో ఈ అమ్మడు చేతిలో మరో ఐదు సినిమాల వరకు ఉన్నాయి. బాలీవుడ్ లో వరుస సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ పాగా వేసిందని చెప్పాలి.
ఇక బాలీవుడ్ నిర్మాత, నటుడుని ప్రేమాయణం కూడా ఆమెకి హిందీలో అవకాశాలు రావడానికి కారణం అవుతుంది. ఈ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో తెలుగు కథలు కూడా వినడానికి ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే మాట వినిపిస్తుంది.
అయితే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అక్కడి అలవాట్లని భాగా ఒంటపట్టించుకుంది. ఈ నేపధ్యంలోనే రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.
ఇక ఈమె అందాల ప్రదర్శనని ఇన్స్టాగ్రామ్ లో లక్షల్లో నెటిజన్లు లైక్ చేస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్సింగ్ స్టైల్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.