Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన బబ్లీ బ్యూటీ ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మధ్యలో కొన్ని ఫ్లాపులొచ్చినా ఇటు సౌత్ లోనో అటు బాలీవుడ్ లోనూ సినిమా, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది.
ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీలో సబర్మతి రిపోర్టర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. హిందీలో సబర్మతి తో బాగా బిజీ అవుతారని ప్రచారం సాగుతోంది. ఈ మూవీ హిట్ అని రాశి కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే, ఎక్కువ సమయం ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే కేటాయిస్తున్నారు.
ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో రిపోర్టర్.. పెళ్లి, పిల్లల గురించి రాశిని అడిగాడు. కాసేపటి వరకూ ఈ టాపిక్ ని దాటేవేసే ప్రయత్నం చేశారు. కానీ, రిపోర్టర్ వదలకుండా పదే పదే అదే ప్రశ్న వేసేసరికి చివరికి సమాధానం చేప్పారు. సినిమా వేరు వ్యక్తిగత జీవితం వేరు. అందరిలాగే నాకు పెళ్లి, పిల్లలు కావాలి. అది నా వ్యక్తిగతం అంటూ సమాధానం ఇచ్చారు.
అయితే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు..ఎవరైనా తన మనసులో ఉన్నారా..? వంటి విషయాలను మాత్రం బయటపెట్టలేదు. కాగా, తెలుగులో గ్యాప్ వచ్చింది. తమిళంలో హిందీలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తెలుగులో మంచి ప్రాజెక్ట్ కోసం రాశీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.