R Madhavan: ఈ మధ్య కాలంలో నెలకు ముప్పై వేలు పెట్టి అద్దె ఇల్లు తీసుకోవడం సాధారణ ప్రజలకి భారం అవుతుంది. కానీ సెలబ్రిటీలు మాత్రం కొన్ని లక్షలలో అద్దె చెల్లించడం కామన్ అయిపోయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ భార్య సరిత ముంబయిలో ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఓ అపార్ట్‌మెంట్‌ను నెలకు రూ. 6.5 లక్షల అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్‌మెంట్ లీజ్ కోసం రూ. 39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిందని సమాచారం.
బాంద్రా ప్రాంతం ముంబయిలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ బాలీవుడ్‌కి చెందిన అనేక ప్రముఖులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇల్లు పొందాలంటే ఖచ్చితంగా కోట్ల రూపాయలు అవసరమవుతాయి, లేదా లగ్జరీ లీజ్ డీల్స్ అవసరమవుతాయి.
మాధవన్ సినిమా విషయానికి వస్తే.. అతను ఇటీవల ‘మా’ అనే సినిమాలో కాజోల్‌తో కలిసి అతిథి పాత్రలో కనిపించాడు. అలాగే ఫాతిమా సనా షేక్‌తో కలిసి నటించిన ‘ఆప్ జైసా కోయి’ అనే రొమాంటిక్ మూవీ జూలై 2025లో నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
అలాగే, అతను ఇటీవల ‘కేసరి చాప్టర్-2’ లో అక్షయ్ కుమార్, అనన్య పాండేతో కలిసి నటించగా, ‘హిసాబ్ బరాబర్’ అనే థ్రిల్లర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం జనవరి 24 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, ఖరీదైన ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించిన మాధవన్ దంపతులు తమ సినిమాలు, లైఫ్‌స్టైల్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.