Tue. Jan 20th, 2026

    PV Sindhu : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఒక మాటలో చెప్పాలంటే అమ్మాయిల క్రష్ విజయ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన యాక్టింగ్ తో ఆటిట్యూడ్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు విజ్జు. ప్రతి సినిమాకు తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు ఈ హీరో. లైగర్ సినిమా మినహా విజయ్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ కూడా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించాయి. ఇదిలా ఉంటే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మాత్రం విజయ్ సినిమాలంటే అస్సలు నచ్చవట. లేటెస్ట్ గా ఆమె చేసిన ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం పీవీ సింధు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరూ దీనిపైనే తెగ చర్చించుకుంటున్నారు.

    pv-sindhu-badminton-star-shocking-comments-on-vijay-deverakonda
    pv-sindhu-badminton-star-shocking-comments-on-vijay-deverakonda

    రీసెంట్ ఇంటర్వ్యూలో పీవీ సింధు తన ఫేవరెట్ సెలబ్రెటీల గురించి చెప్పుకొచ్చింది. ” నాకు రామ్​చరణ్, ఎన్టీఆర్​​ అంటే ఇష్టం. ఇక ప్రభాస్ నా క్రష్. ఆయన మూవీస్ ఎక్కువగా చూస్తాను. ఆయనను ఒక్కసారైనా కలవాలనుకున్న. కానీ అతనితో మాట్లాడే ఛాన్స్ ఇప్పటికీ రాలేదు. బ్యాడ్మింట‌న్ వల్ల వచ్చే స్ట్రెస్ నుంచి బయటపడేందుకు సినిమాలు చూస్తాను. నాకంటూ ఎవరు ఫేవరెట్ హీరో లేరు. అయితే విజయ్ దేవరకొండ మూవీస్ నాకు పెద్దగా నచ్చవు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆ సినిమాలు ఏంటన్నది సింధు చెప్పలేదు.

    pv-sindhu-badminton-star-shocking-comments-on-vijay-deverakonda
    pv-sindhu-badminton-star-shocking-comments-on-vijay-deverakonda

    సింధు గతంలో సినిమాల్లోకి వస్తుందని టాక్ వినిపించింది. అయితే అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చింది సింధు. సినిమాల్లోకి రావాలనే ఆలోచన త‌న‌కు లేద‌ని చెప్పింది ఈ బ్యాడ్మింట‌న్‌ స్టార్. తన ఆట పైనే ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలిపింది. సినిమాల్లో న‌టించే అంత ఫ్రీ టైం తనకు లేదని చెప్పింది. భ‌విష్య‌త్తులో వెళ్తావా అంటే ఇప్పుడే చెప్ప‌లేన‌ని తెలిపింది. ఒక‌వేళ త‌న బ‌యోపిక్ తీస్తే ఆ మూవీలో దీపికా ప‌డుకొణె హీరోయిన్ అయితే తనకు ఓకే అని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.