Betel Leaf: తమలపాకు మన హిందూ సాంప్రదాయాలలో ఎంతో మంచి ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఏ చిన్న శుభకార్యం జరిగిన ముందు తమలపాకులను తీసుకువస్తూ ఉంటారు ఇలా తమలపాకుకి చాలా మంచి ఆదరణ ఉంది. ఇలా శుభకార్యాలలో మాత్రమే కాకుండా వాస్తు శాస్త్ర పరంగా కూడా తమలపాకు ద్వారా ఎన్నో రకాల శుభాలను మనం పొందవచ్చు. తమలపాకు తీసుకొని రాత్రి పడుకునే సమయంలో మన దింట్లో కింద పెట్టుకొని పడుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
తల దిండు కింద ఈ తమలపాకులు పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే జాతకంలో బుధ గ్రహం బాగుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బుధుడు తెలివితేటలకు, ఆరోగ్య సిద్ధికి కారణం. అలాగే వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించాలంటే బుధుడు అనుకూలించాలి. అందుకే తమలపాకును తల దిండు కింద పెట్టుకుంటే ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన అనేవి దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాకుండా ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది.
నిద్ర సంబంధిత సమస్యలతో బాధ పడేవారు దిండు కింద తమలపాకు పెట్టుకుని నిద్రించడం మంచిది. అంతేకాకుండా శరీరంలోని, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.గంగాజలం లేదా తులసి నీటిలో తమలపాకును ఉంచి.. ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో కట్టి దిండు కింద పెట్టుకోవాలి. ఇలా చేయడం ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. మానసిక ధైర్యాన్ని కూడా పెంచుతుంది. ఇలా తమలపాకుతో ప్రయోజనాలన్నింటిని కూడా మనం పొందవచ్చు.