Devotional Facts: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటాము ఇలా దీపారాధన చేసే సమయంలో చాలామంది వివిధ రకాల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు కొందరు ఆముదం నూనెను ఉపయోగించగా మరికొందరు ఆవనూనె మరికొందరు కొబ్బరి నూనెతో కూడా దీపారాధన ఉపయోగిస్తుంటారు కానీ దీపారాధన చేసే సమయంలో నువ్వుల నూనెను ఉపయోగించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. అసలు దీపారాధన చేయటానికి నువ్వుల నూనె ఎందుకు అంత ప్రత్యేకం అనే విషయానికి వస్తే..
నువ్వుల నూనెలో సహజంగా సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా త్వరగా క్షీణించడానికి అనుమతించదు. ఆయుర్వేదంలో వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనె అని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. వేద పండితుల ప్రకారం నువ్వుల నూనె లేకుండా ఏ కార్యక్రమమూ చేయరు. ఏ యజ్ఞం చేసిన,పితృ పూజలు చేసిన నువ్వుల నూనెను కచ్చితంగా ఉపయోగిస్తారు.కాబట్టి పూజకు ఉపయోగించే నూనెలో మొదటిగా నువ్వుల నూనెకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.
ఇలా నువ్వుల నూనె దీపారాధనకు ఉపయోగించటం వల్ల మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడతామని అలాగే మానసిక ప్రశాంతత ఉంటుందని తెలుస్తుంది .అలాగే శని ప్రభావ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అందుకే నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఎంతో మంచిది.