Pregnant Women: ప్రతి ఒక్క మహిళ గర్భం దాల్చి అమ్మతనాన్ని ఆస్వాదించాలని చూస్తారు. అయితే గర్భధారణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో ఎంతో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తినడమే కాకుండా కొన్ని బరువైన పనులు చేయకూడదని అలాంటి పనులకు దూరంగా ఉండటం మంచిదని చెబుతుంటారు.ఈ విధంగా గర్భిణీ స్త్రీలు ప్రసవం అయ్యేవరకు పలు జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చలికాలంలో గర్భిణీ స్త్రీలు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని కొన్ని పనులను అసలు చేయకూడదు మరి ఆ పనులు ఏంటి ఆ జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా గర్భిణీ స్త్రీలలో మరొక బిడ్డ ఎదుగుదల ఉంటుంది కనుక వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందుకే రోకనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చలికాలంలో ఈ రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడుతుంది తద్వారా తొందరగా బలహీనులవుతారు. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందో ఆ క్షణం అంటువ్యాధులకు కూడా గురికావాల్సి ఉంటుంది.
Pregnant Women
ఇక చలికాలంలో చలిని తట్టుకోవడం కోసం గర్భిణీ స్త్రీలు తరచూ టీ తాగుతూ ఉంటారు. ఇలా అసలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. టి అధికంగా తీసుకోవడం వల్ల మనం మన శరీరానికి కేఫిన్ అధిక మొత్తంలో అందించినట్లే. అందుకే ఇది గర్భిణీ స్త్రీలకు ఏమాత్రం మంచిది కాదు.అలాగే చాలామంది చలికి తట్టుకోలేక చాలా మందపాటి దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఇలా మందమైన దుస్తులను కూడా ధరించకూడదు. ఇలా మందపాటి దుస్తులు ధరించడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సరిగా జరగకపోవడంతో శరీరం మొత్తం వాపు ఏర్పడుతుంది.చలికాలంలో చాలామంది మహిళలు నీళ్లు తాగడానికి ఇష్టపడరు కానీ ఇలా తాగకపోవడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడాల్సి ఉంటుంది అందుకే తరచూ నీటిని త్రాగుతూ ఉండాలి.