Prabhas: ప్రభాస్ సలార్ సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను పెంచేయడమే కాకుండా అడ్వాన్స్ బుకింగ్ గా భారీ స్థాయిలో టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమాకు వచ్చినటువంటి ఆదరణ చూస్తుంటే కనుక సినిమా తప్పకుండా హిట్ అవుతుందని సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రేక్షకులలో ఉన్నటువంటి అంచనాలను ఈ సినిమా అందుకుందని చెప్పాలి.
ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఈ సినిమా చూసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సినిమా సెలబ్రిటీలు సినిమాపై పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రభాస్ సినిమా మంచి సక్సెస్ అవుతుందని కమర్షియల్ గా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సలార్ విషయంలో అభిమానులందరూ ఎంతో సంతోషంగా ఉన్నటువంటి తరుణంలో ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ రావడంతో ఓ బాలీవుడ్ హీరో ఈ సినిమా సక్సెస్ కాకూడదు అని హోమం అలాగే ప్రత్యేకంగా పూజలు చేయించారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హీరోగా వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ప్రభాస్ ఏలుతున్నారు. దీంతో ఈయనని తొక్కేయాలని బాలీవుడ్ ఇండస్ట్రీలో కుట్రలు కూడా జరుగుతున్నాయి అంటూ పలు సందర్భాలలో వార్తలు వచ్చాయి. దీంతో సలార్ సినిమా కూడా హిట్ కాకూడదని ఆ స్టార్ హీరో ఇలాంటి పని చేయించారని తెలిసి ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.