Politics: లోకేష్ పాదయాత్ర చుట్టూ రాజకీయం..

Politics: నారా లోకేష్ ఈనెల 27 నుంచి పాదయాత్ర చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ గళం పేరుతో ఈ పాదయాత్రను చేపట్టడానికి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 123 నియోజకవర్గాల్లో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను చేయడానికి నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే టీడీపీ పార్టీ డీజీపీకి పర్మిషన్ కోసం లేఖ రాశారు. అయితే డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటివరకు పాదయాత్రపై ఎలాంటి అనుమతి రాలేదు. తాజాగా ఈ పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు ఎన్ని రోజులు జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు అనే వివరాలతో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఆదేశాలు వచ్చాయి.

అయితే పాదయాత్రను కావాలని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పాదయాత్ర చేస్తే ఎక్కడ ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోతుందో అనే భయం వైసీపీ పార్టీలో ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో వైయస్ జగన్ పాదయాత్రకి అనుమతి ఇవ్వకుండా ఉంటే ఈరోజు అధికారంలోకి వచ్చే వారే కాదని విమర్శిస్తున్నారు. అలాగే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఇవ్వకున్నా పాదయాత్ర మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందని వర్ల రామయ్య తెలిపారు. కావాలని కుట్రలు చేస్తూ పాదయాత్రకు ఆటంకం సృష్టించాలని భావిస్తున్నారని విమర్శించారు. జగన్ పరిపాలనపై విసిగిపోయి ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాదయాత్రలో పాల్గొంటారని అన్నారు.

నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే వైసీపీకి భయం వెంటాడుతుందని కొల్లు రవీంద్ర విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే యువశక్తిని అడ్డుకున్నట్లే అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అయితే నారా లోకేష్ చేస్తుంది పాదయాత్ర కాదని టీడీపీ ఓటమి కోసం చేస్తున్న యాత్రని మంత్రి రోజా విమర్శించారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ టీడీపీ దారుణంగా ఓడిపోయిందని పేర్కొన్నారు. ఈ పాదయాత్రతో కూడా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తారని వ్యంగ్యంగా విమర్శలు చేశారు.

అలాగే నారా లోకేష్ పాదయాత్రలో దాడులు చేయాలని వైసిపి సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ లో సందేశాలు పంపుతున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా చూపించారు. కుట్రలు చేసి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అంతే దీటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమాధానం చెబుతారని అన్నారు. మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం వైసిపి పార్టీల మధ్య నారా లోకేష్ పాదయాత్ర మీద రాజకీయం నడుస్తుంది అనే మాట వినిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.