Grapes: మనకు మార్కెట్లో విరివిగా లభించే వాటిలో ద్రాక్ష కూడా ఒకటి అయితే ద్రాక్షను ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ద్రాక్షలో మనకు విటమిన్ సి, విటమిన్ ఏ, బి6, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ద్రాక్షలో పొటాషియం, క్యాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల పోషకాలు మనకు పుష్కలంగా లభిస్తాయి. అందుకే ద్రాక్ష తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు.
ద్రాక్షలో ఉండే ప్లేవనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇక చదువుకునే పిల్లలలో ఏకాగ్రత పెరగడానికి కూడా ద్రాక్ష ఎంతగానో దోహదం చేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే ద్రాక్ష పండ్లను కొన్ని సమస్యలతో బాధపడేవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి ద్రాక్ష పండ్లను ఎవరు తినకూడదు అనే విషయానికి వస్తే…జీర్ణ సమస్యలు, ప్రేగు సమస్యలతో బాధపడుతున్న వారు ద్రాక్షకు దూరంగా ఉండాలి.అలాగే డయాబెటిస్, అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా లిమిట్ గా తీసుకోవాలి. అలాగే ఎలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ ద్రాక్షను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని ఇలాంటివారు ద్రాక్షను కాస్త దూరం పెట్టడమే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అంటూ నిపుణులు చెబుతున్నారు.