Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండటమే. గబ్బర్‌సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్‌ని పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
పవన్ సరసన హీరోయిన్స్‌గా డాన్సింగ్ క్వీన్ శ్రీలీల, రాశీఖన్నా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పెద్ది సినిమా రిలీజ్ డేట్ మారడంతో ఆ ప్లేస్ ని ఉస్తాద్ భగత్‌సింగ్ ఫిల్ చేశాడు. ఇప్పటికే, ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రిలీజైన రెండు పాటలు, టీజర్, పవన్ కళ్యాణ్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Pawan Kalyan: మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిక్స్
ఇక, మార్చి నెలలోకి ఎంటరవడంతో హరీష్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీకి సంబందించిన ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచబోతున్నారు. ఇకపై మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలోనే, గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబందించిన పనులను కూడా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం హైదరబాద్ లోని శిల్పకళా వేధికను ఈవెంట్ కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకరకంగా ఈ ప్లేస్ చాలామంది మేకర్స్‌కి, హీరోలకి లక్కీ ప్లేస్.
ఇక, ఈవెంట్ కోసం మేకర్స్ మార్చి 19వ తేదీని ఫిక్స్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. అంటే, రిలీజ్ తేదీకి సరిగ్గా వారం ముందుగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. OG సినిమాతో పవర్ స్టార్ 300 కోట్ల మార్క్ ని చేరుకున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్ళు రాబట్టిన సినిమా OG. అందుకే, ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీపై అంచనాలు స్కై రేంజ్‌లో ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాటల ప్రకారం 400 కోట్ల వరకూ వసూళ్ళు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే, అన్నీ ప్రాంతాలలో బిజినెస్ కూడా పూర్తైందని సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరోసారి ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.

