Pawan Kalyan: పవర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలలో కూడా చురుకుగా వెళ్తున్నారు. రానున్న ఎన్నికలలో ఏపీలో బలమైన ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతమ్ మూవీ రీమేక్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో ప్రస్తుతం ఉన్నారు. గత పది రోజుల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే మే మొదటి వారంలో సుజిత్ ఓజీ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా కోసం 45 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్.
దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు మూవీ షూటింగ్ కూడా ఆగష్టు లోపు ఫినిష్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత వారాహితో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పర్యటన చేయనున్నారు. ఎన్నికలకి ముందు బలం పుంజుకొని కచ్చితమైన ప్రభావాన్ని రానున్న ఎన్నికలలో చూపించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయ సర్వేలు కూడా ఈ సారి జనసేన ప్రభావం కచ్చితంగా ఉంటుందనే చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం మరో ఇద్దరు దర్శకులు వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ 2 స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ తోనే చేసే ప్లానింగ్ లో ఉన్నారు. అలాగే సుదీర్ వర్మ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ మూవీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ జనసేన అంచనాలు కనుక నిజం అయితే పవన్ కళ్యాణ్ 2024 తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ముఖ్యమంత్రి హోదాలో సినిమాలలో నటిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా వినిపిస్తోంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.