Wed. Jan 21st, 2026

    Entertainment: ఇకపై అన్ని టెలివిజన్ ఛానెల్‌లు జాతీయ ప్రయోజనాల కోసం ప్రతిరోజూ 30 నిమిషాల పాటు జాతీయ న్యూస్ కంటెంట్‌ను తమ టీవీ ఛానల్స్‌లో ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఈ సూచనను తప్పనిసరిగా పాటించాలని తాజాగా భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, స్పోర్ట్స్‌, వైల్డ్ లైఫ్ స్టోరీస్ ప్రసారం చేసే ఛానెల్‌లకు ఈ కొత్త నిబంధన వర్తించదు. విదేశీ ఛానెల్‌లకు కూడా ఇవి వర్తించవు.ఈ విషయానికి సంబంధించిన సర్కులర్ త్వరలో విడుదల కానుంది.

    ప్రజా సేవ ప్రసార సాధనాల ప్రధాన బాధ్యత, ఎయిర్‌వేవ్‌లు/ ఫ్రీక్వెన్సీలు పబ్లిక్ ప్రాపర్టీ, సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉన్నందున, భారతదేశంలో అన్ని ఛానెల్‌ లు అప్‌లింక్ చేయడానికి , డౌన్‌లింక్ చేయడానికి ఇచ్చిన ఈ మార్గదర్శకాల ప్రకారం జాతీయ ప్రాముఖ్యత కలిగిన న్యూస్‌తో పాటు , సామాజిక అంశాలతో కూడిన న్యూస్‌ను రోజులో కనీసం 30 నిమిషాల పాటు ప్రసారం చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆసక్తి కలిగిన కంటెంట్ థీమ్‌లను కూడా మార్గదర్శకాలలో పేర్కొనింది. వీటిలో విద్య& అక్షరాస్యత వ్యాప్తి, వ్యవసాయం & గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, సైన్స్ & టెక్నాలజీ, మహిళల సంక్షేమం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం &జాతీయ సమైక్యత వంటి కథనాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.

    ow-all-tv-channels-must-broadcast-that-news-for-30-minutesస్పోర్ట్స్ ఛానెల్‌లు ఇతర వైల్డ్ లైఫ్ ఛానెల్స్ మినహా , మిగతా ఛానెల్‌లు తమ మెటీరియల్‌ను తగిన విధంగా మాడ్యులేట్ చేసి తమ బాధ్యతను నిర్వర్తించాలని కూడా ప్రకటనలో పేర్కొంది.అదనంగా, జాతీయ ఆసక్తి ఉన్న కంటెంట్ ప్రసారం గురించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఏదైనా సాధారణ సలహాకు నెట్‌వర్క్‌లు కట్టుబడి ఉండాలని పేర్కొనబడింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కంటెంట్‌ను ప్రసారం చేసే సమయం గురించి అడిగినప్పుడు తాము విధివిధానాలపై పని చేస్తున్నామని పేర్కొనాలన్నారు.

    ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు న్యూస్ ఛానెల్‌లు జాతీయ న్యూస్‌ను ప్రతి బులిటెన్‌లో కవర్ చేస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన మేరకు ఇకపై 30 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో జాతీయ న్యూస్‌ను కవర్ చేయాల్సి ఉంటుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.