Wed. Jan 21st, 2026

    Oscars-2023 : ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ తెచ్చిపెట్టిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఓల్డ్ పిక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఆ పిక్‌ని సరిగ్గా చూస్తేగానీ ఈయన రాజమౌళి అని గుర్తుపట్టరు. ఇప్పుడు మన తెలుగువాళ్ళు ఏ మూలన ఉన్నా వారందరూ మాట్లాడుకుంటుందీ అంటే నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందం గురించే. ఆస్కార్ వేదికపై ఈ పాటకి చిత్ర బృందం మాత్రమే కాదు, ఇతర ప్రపంచ భాషలకి చెందిన సినీ లవర్స్ కూడా ఎంతో హుషారుగా కాలు కదిపారు.

    ఆస్కార్ నామినేషన్స్‌కి వెళ్లినప్పటి నుంచే భారత దేశం నలుమూలలా ఖచ్చితంగా అవార్డ్ దక్కించుకుంటుందనే ధీమాను వ్యక్తం చేసిన వారు ఎక్కువమందే ఉన్నారు. ఆ ధీమా నిజం అయింది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మన ఇండియన్ సినిమాను ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి ముఖ్యమంత్రులు..సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలియపరుస్తున్నారు.

    oscars-2023-The old picture of Rajamouli who brought Oscar with the movie "RRR" is viral.
    oscars-2023-The old picture of Rajamouli who brought Oscar with the movie “RRR” is viral.

    Oscars-2023 : రాజమౌళి భారతీయుల కలను నెరవేర్చారు.

    అయితే, ఇప్పుడు ఈ ప్రఖ్యాత దర్శకుడికి సంబంధించిన ఓ ఓల్డ్ పిక్ నెట్టింట దర్శనమిచ్చి అంతటా వైరల్ అవుతోంది. రాజమౌళి యంగ్ ఏజ్‌లో తన స్నేహితులతో కలిసి ఉన్న పిక్ బాగా వైరల్ అవుతోంది. ఇందులో రాజమౌళి పాత స్కూటర్ మీద కూర్చుని.. చేతికి వాచ్ పెట్టుకుని చాలా సింపుల్ గా కినిపిస్తున్నారు. ఇంతే సింపుల్‌గా ఇప్పుడూ ఉండటం విశేషం. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు భారతీయుల కలను నెరవేర్చారు.

    కాగా, ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఆయన తండ్రితో పాటు చర్చల్లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నారు. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయాల తర్వాత రాజమౌళి-మహేష్ కాంబోలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో మొదలై ఉంటాయో ఊహించడం చాలా కష్టం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.