Vastu Tips: సాధారణంగా మనం ఆచార వ్యవహారాలతో పాటు వాస్తు నియమాలను కూడా ఎంతగానో విశ్వసిస్తూ ఉంటాము. ఇలా వాస్తు ప్రకారం మనం ఏదైనా పనులు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయని అందరూ భావిస్తూ ఉంటాము. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను మనం మన దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కొంటూ ఉంటామని పండితులు చెబుతున్నారు. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మూడు వస్తువులకు పొరపాటున కూడా ఇంట్లో ఉండకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో తప్పనిసరిగా గడియారం ఉంటుంది. అయితే గడియారం ఇంట్లో ఉండటం మంచిదే కానీ ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండటం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆగిపోయిన గడియారం ఇంట్లో కనుక ఉంటే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా డబ్బు కోసం ఇబ్బందులు పడతారు. అందుకే ఆగిపోయిన గడియారం కనుక ఇంట్లో ఉంటే వెంటనే దానిని మరమ్మత్తు చేయించాలి లేదా ఇంటి నుంచి బయటకు పడేయాలి.
మన ఇంట్లో ఉన్న పాత ఇనుప వస్తువులు తుప్పు పడతాయి. తుప్పు అనేది లోహం క్షయంగా పరిగణిస్తారు. దీనిలో మెటల్ సానుకూల శక్తి పోతుంది. అది ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సానుకూలత లేకపోవడం, గొడవలు కొట్లాటలు జరగడం వంటివి జరుగుతుంటాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఇక
తరచుగా ప్రజలు పాత ఇత్తడి పాత్రలను ఏదో ఒక మూసి ఉన్న ప్రదేశంలో ఉంచుతారు. ఈ పాత్రలను చీకటిలో ఉంచడం ద్వారా శని వాటిలో నివసిస్తుందని, జీవితంలో సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వ్యాప్తి చెందుతూ ఉంటాయి అందుకే ఇత్తడి సామాన్లను కూడా ఇంట్లో లేకుండా చూసుకోవడం మంచిది.