Ashada Masam: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాడం మాసానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆషాడ మాసంలో ఇలాంటి శుభకార్యాలు చేయకపోయినా పూజలు వ్రతాలు మాత్రం చేసుకుంటూ ఉంటారు. ఇలా తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతినెలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుని ఉంది. ఇక ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలు లేకపోయినా కొన్ని రకాల పూజలను చేయటం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆషాడ మాసంలో మనం ఏ పనిలోనైనా విజయం సాధించాలన్న, జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఈ మొక్కను తప్పనిసరిగా పూజించాలని పండితులు చెబుతున్నారు.
ఆషాడ మాసంలో అరటి చెట్టును తప్పకుండా పూజించాలని పండితులు చెబుతున్నారు. అరటి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తూ ఉంటారు అందుకే అరటి చెట్టును ఆషాడం మాసంలో పూజించడం వల్ల ఆ విష్ణుమూర్తి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఆషాడ మాసంలో వచ్చే గురువారం ఉదయమే తలంటూ స్నానం చేసి అరటి చెట్టును పూజించాలి. అరటి చెట్టు కింద శుభ్రం చేసి అనంతరం మొదట్లో నీటిని పోసి పూజించాలి.
అరటి చెట్టు కాండం పై చందనం పూసి ఏడుసార్లు ఎరుపు రంగు దారం చుట్టాలి. అనంతరం పువ్వులతో అలంకరించి పండ్లను నైవేద్యంగా పెట్టాలి..ఇక్కడ నెయ్యితో దీపారాధన చేసి అరటి చెట్టును ఆరాధించి అనంతరం కొబ్బరికాయ కొట్టాలి. ఇలా ఆషాడమాసంలో అరటి చెట్టును కనుక పూజిస్తే మనం చేసే పనులలో తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే మనం ఏదైనా సంకల్పంతో ఒక పని నిర్వర్తిస్తున్నప్పుడు ఆ పని విజయం అవుతుందని అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.