Sat. Nov 15th, 2025

    NTR-Prabhas : శతాబ్దాల స్వప్నం సాకారమైంది. జన్మస్థలమైన అయోధ్య లో శ్రీరాముని మందిరం కొలువుదీరింది. బాల రాముడి రూపంలో రాముల వారు ప్రజలకు భవ్య మందిరంలో దర్శనమిస్తున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరుండి మరీ గర్భగుడిలో శాస్త్రోక్తంగా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను నిర్వహించారు. ఈ అపురూపమైన అత్యున్నతమైన కార్యక్రమాన్ని కన్నులారా చూసి భక్తజనం పులకించిపోయింది. ఇక అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముని విగ్రహానికి బాలక్ రామ్ గా పేరు పెట్టారు. ఇదిలా ఉంటే వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ జనవరి 22 నకార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఆయోధ్యకు చేరుకున్నారు. సినీ తారల రాకతో అయోధ్యా నగరంలో కొత్త సందడి నెలకింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌, సూపర్ స్టార్ ధనుష్‌, బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ ఇలా ఎందరో స్టార్స్ ఈ కార్యక్రమంలో తళుక్కుమన్నారు. అయితే ఈ కార్యక్రమానికి పిలుపు అందినా కొంత మంది స్టార్స్ అయోధ్య రాలేకపోయారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందినా కూడా అక్కడికి ఆయన వెళ్లలేకపోయారు. దేవర్ షూటింగ్ కారణంగానే ఎన్టీఆర్ అయోధ్య వెళ్లలేదని తెలుస్తోంది. ప్రస్తతుం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్‌ అవుతుంది.

    ntr-prabhas-that-is-why-tollywood-star-hero-did-not-go-to-ayodhya
    ntr-prabhas-that-is-why-tollywood-star-hero-did-not-go-to-ayodhya

    కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సినీ ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో మేజర్‌ షెడ్యూల్‌ను ముందుగానే చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిందట. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నాడే సైఫ్‌ అలీఖాన్‌తో కీలకమైన భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని ప్లాన్‌ చేశారట. భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారట. అంతే కాదు కొన్ని వందల మంది ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. అందుకే తారక్‌ వీరందరికీ అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో మరీ ముఖ్యంగ నిర్మాతను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆయోధ్యకు రాలేకపోయారని టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో సైఫ్‌ అలీఖాన్‌ కు గాయం కావడం ఆయన హాస్పిటల్ లో చేరడంతో తారక్‌ అయోధ్య ట్రిప్‌ క్యాన్సల్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి మూవీ యూనిట్‌ కానీ, తారక్‌ కానీ ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు.

    ntr-prabhas-that-is-why-tollywood-star-hero-did-not-go-to-ayodhya
    ntr-prabhas-that-is-why-tollywood-star-hero-did-not-go-to-ayodhya

    ఇక పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ కూడా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని అయోధ్య నుంచి ఆహ్వానం అందినా వెళ్లలేకపోయారు. కల్కి సినిమా కారణంగానే అయోధ్య వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తున్న అతి భారీ చిత్రం కల్కీ. ఈ మూవీలో దీపికా పదుకొణె తదితరులు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని అనుకున్న సమయానికి విడుదల చేయాలనే లక్ష్యంతో నాగ్ అశ్విన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌ లో ప్రభాస్‌ బిజీ అయ్యాడు. ప్రస్తుతం కల్కి మూవీకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అందుకే ప్రభాస్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయాడని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కూడా ప్రభాస్‌ కానీ, ఆయన టీం కానీ అధికారిక ప్రకటించలేదు.