Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని పెట్టుకొని ఉన్నాడు. ఈ నాలుగింటిలో ఆదిపురుష్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా మిగిలిన మూడు సెట్స్ పైన ఉన్నాయి. సలార్ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. అలాగే మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలాక్స్ షూటింగ్ కొనసాగుతోంది. దీంతో పాటు ప్రాజెక్ట్ కె మూవీ సెట్స్ పైన ఉంది. ఈ మూవీ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ గా రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాల నుంచి అప్డేట్స్ కావాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
అయితే చిత్ర యూనిట్ మాత్రం స్పందించడం లేదు. మారుతిని అయితే ట్విట్టర్ లో ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ పైన కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ కె పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న సినిమా కావడం ఫ్యాన్స్ ఆ మూవీ విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాల నుంచి అప్డేట్స్ ఏవీ కూడా రాకపోవడానికి కారణం ఆదిపురుష్ మూవీ అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ వరకు మిగిలిన సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వొద్దు అని ప్రభాస్ క్లియర్ గా దర్శకులకి అల్టిమేటం జారీ చేశాడంట.
ఒక వేళ అలా అప్డేట్స్ ఇస్తే బజ్ మొత్తం వాటి మీదకి వెళ్ళిపోతుందని భావిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ పై ఆడియన్స్ లో ముందు హైప్ క్రియేట్ చేయాలని, తద్వారా జూన్ 16న సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ప్లాన్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారు. అందుకే ఆదిపురుష్ రిలీజ్ అయ్యేంత వరకు మరొక సినిమా అప్డేట్ ఇవ్వొద్దు అని చెప్పడంట. ఈ నేపధ్యంలో సలార్ ప్రోమో, ప్రాజెక్ట్ కె ఫస్ట్ లుక్ జూన్ తర్వాతనే ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.