Categories: LatestNewsPolitics

AP Politics: జగన్ దూకుడుకి చంద్రబాబు కళ్ళెం

AP Politics: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం ఓ రకంగా ఎన్నికల వేడి ఉందని చెప్పాలి. ఓ వైపు వైసీపీ సర్కార్ జగనన్నే మా భవిష్యత్తు అంటూ ఎమ్మెల్యేలని భుజానికి బ్యాగులు తగిలించుకొని ఇంటింటికి పంపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, గ్రామ సారథులు ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తూ వారి వివారాలు సేకరిస్తూ కొత్తరకమైన ప్రచారం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారంలో దూకుడుగానే వ్యవహరిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు.

అందుకే జగన్ విమర్శలకి దీటుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు. జగన్ తనని తాను బయటకి వచ్చిన ప్రతిసారి మీ బిడ్డ అంటూ పరిచయం చేసుకుంటారు. అయితే చంద్రబాబు దీనిపై దీటుగానే రియాక్ట్ అయ్యారు. జగన్ ఏపీ ప్రజలకి బిడ్డ కాదని, క్యాన్సర్ గడ్డ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను ఎంత వేగంగా అధికారంలోంచి దిగిపోతే ఏపీ అంత అభివృద్ధి చెందుతుంది అని ప్రజలకి చెబుతున్నారు. మరో వైపు టీడీపీ నాయకులు నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఇసుక దోపిడీని తెరపైకి తీసుకొచ్చి చూపిస్తున్నారు.

అభివృద్ధిపై ప్రశ్నిస్తున్నారు. అలాగే నారా లోకేష్ కూడా యువగళం పాదయాత్రతో స్పీడ్ మీద ఉన్నారు. అధికార పార్టీ వైఫల్యాలని ఎండగడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ నాయకులు అందరూ కూడా నారా లోకేష్ పై ఎదురుదాడి చేస్తున్నారు. లోకేష్ కు కూడా కావాల్సిందే ఇదే కావడం విశేషం. ఇక మరో ఏడాది కాలం మాత్రమే ఉండటంతో మరింత బలంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి అధికార పార్టీ  వైఫల్యాలని ఎండగట్టడంలో చంద్రబాబు కచ్చితమైన వ్యూహాలు వేసుకుంటూ వెళ్తున్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.