Mon. Jul 14th, 2025

    Niharika Konidela : యదు వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కమిటీ కుర్రోళ్లు. ఈ మూవీని నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి ప్రొడ్యూజ్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్లులో ఫ్రెష్ టాలెంట్ కనిపించనుంది. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్ హైదరాబాద్‌ వేదికగా టీజర్‌ని రిలీజ్ చేసింది. ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు నిహారిక స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్ ఇష్యూ గురించి స్పందించారు.

    niharika-konidela-reaction-on-allu-arjun-and-sai-dharam-tej-issue
    niharika-konidela-reaction-on-allu-arjun-and-sai-dharam-tej-issue

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విక్టరీ సాధించారు. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. మెగా ఫ్యామిలీ కూడా పవన్ గెలుపును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెగా యువహీరోల సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈ సందడిలో ఒక్క ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యనే జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో బన్నీ వైసీపీ క్యాండిడేట్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. రిజల్ట్స్ తర్వాత మామకు ట్విటర్లో పోస్ట్ పెట్టి తన పని తాను చేసేశాడు. ఇదే క్రమంలో రిజల్ట్స్ అనౌన్స్ మెంట్ తర్వాత అల్లు అర్జున్‌ను మెగా హీరో సాయి తేజ్‌ సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. దాంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. అల్లు అర్జున్‌ భార్య స్నేహను సైతం ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో అన్‌ఫాలో చేసినట్లు సమాచారం. అల్లు వారి ఫ్యామిలీలో కేవలం అల్లు శిరీష్‌ను మాత్రమే తేజ్‌ ప్రస్తుతం ఫాలో అవుతున్నాడు. అయితే సాయి తేజ్‌ తప్ప మిగతా హీరోలందరూ బన్నీని ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. నెటిజ్స్ దీని గురించే అప్పటి నుంచి తెగ డిస్కస్ చేస్తున్నారు.

    niharika-konidela-reaction-on-allu-arjun-and-sai-dharam-tej-issue
    niharika-konidela-reaction-on-allu-arjun-and-sai-dharam-tej-issue

    రీసెంట్ గా ఈ వివాదం గురించి నిహారిక కొణిదెల రియాక్ట్ అయ్యింది. కమిటీ కుర్రోళ్లు టీజర్‌ లాంచ్‌ ఈవెంట్ కి వచ్చిన నిహాను ఈ టాపిక్ గురించి ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా.. “అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్‌ ఇష్యూ గురించి నాకు ఇంకా తెలియదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి కదా” అని రిప్లై ఇచ్చి టాపిక్ డైవర్ట్ చేసింది.సినిమా గురించి మాట్లాడుతూ..”ఓ కుటుంబంలా ఎంతో కష్టపడి సినిమా తీశాం. త్వరలోనే ట్రైలర్ లాంచింగ్ ఉంటుంది. వంశీ స్టోరీ చెప్పినప్పుడు పదకొండు మంది జీవితాల్ని ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపించింది. ఈ మూవీలోని ప్రతి ఎమోషన్ అందరికీ కనెక్ట్‌ అవుతుంది” అని తెలిపింది.