Nayanthara: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ని మించిపోయిందనే టాక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. సినిమా విషయంలో నయన్ అసలు కాంప్రమైజ్ కాదు. మరీ ముఖ్యంగా రెండు విషయాలలో ఎవరు చెప్పినా వినదు. వాటిలో ఒకటి రెమ్యునరేషన్..రెండవది ప్రమోషన్స్. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా, ఏ స్టార్ హీరో ఉన్నా నయనతార ప్రమోషన్స్‌కి రాదు.
ఇప్పటికే చాలాసార్లు నిర్మాతలు నయనతారని ప్రమోషన్స్‌కి ఒప్పించాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. అయితే, లేటెస్ట్ టాక్ ఏంటంటే నయనతార ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. బాలీవుడ్‌లో దీపిక అందుకుంటున్న రెమ్యునరేషన్ 10 కోట్లు అని సమాచారం. నయనతారకి 5 కోట్లు ఉండేదట. కానీ, ఇప్పుడు 12 కోట్లు డిమాండ్ చేస్తుందని తాజా సమాచారం.
పాన్ ఇండియా సినిమాలకే నయన్ అందుబాటులో ఉండేలా ఉంది. మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించే నిర్మాతలు భయపడాల్సిందే. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ చేసిన జవాన్ సినిమాకి షారుఖ్ ఖాన్ 10 కోట్ల రూపాయలు నయన్ కి రెమ్యునరేషన్ ఇచ్చారట. దాంతో థగ్స్ సినిమాకి ఏకంగా 12 కోట్లు అడిగిందట. అది మరీ ఎక్కువని సైలెంట్ అయిన నిర్మాతలు త్రిష వైపు టర్న్ తీసుకున్నారట.
బాలీవుడ్‌లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ దీపకదే ఉంది. ఆమె ఒక్కో సినిమాకి 10 కోట్లు అందుకుంటుంది. అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవాలని నయనతార ఆలోచిస్తుందట. అదే జరిగితే, ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో నయన్‌దే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అవుతుంది. కానీ, అంత ఇస్తారా..? అనేది ఇప్పుడు నెట్టింట నడుస్తున్న హాట్ టాపిక్. ఏదేమైనా బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేసిన నయనతార ఏకంగా దీపిక పదుకొన్ నే తొక్కేయాలని చూస్తుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.