28‘కల్కి 2898AD’: ప్రభాస్ కి పెద్ద డ్యామేజ్ అవుతోంది. ఆయన నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘కల్కి 2898AD’. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే డార్లింగ్ మోకాలి సర్జరీ చేయించుకొని ఇండియాకి తొరిగొచ్చారు. సలార్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు ‘కల్కి 2898AD’ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
అయితే, ఈ సినిమా నుంచి ఏదో ఒక లీక్ బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. ఎంత జాగ్రత్తపడుతున్నా ఆన్ సెట్ నుంచి ఏదో ఒక లీక్ బయటపడుతూనే ఉంది. గతంలో అత్తారింటికి దారేది సినిమా సగం రిలీజైంది. ఆ తర్వాత అజ్ఞాతవాసి. మేకర్స్ ఎంత పకడ్బంధీగా ఉన్నా యూనిట్ సభులలో ఎవరో ఒకరు లీక్ చేస్తున్నారు. ఇక సలార్ సినిమా నుంచి కూడా ఇలాగే లీకులు బయటకి వచ్చాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సలార్ తెలంగాణలోని రామగుండంలో మొదట చిత్రీకరణ ప్రారంభమైంది. అప్పుడు సెట్ నుంచి ప్రభాస్ లుక్ లీకైంది. అలా సలార్ నుంచి, రాధే శ్యామ్ సినిమా నుంచి లీకులొచ్చాయి. అలా రావడం వల్ల ప్రభాస్ సినిమాకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడేమో కల్కి సినిమా నుంచి ఈ లీకులు వచ్చి మేకర్స్ ని టెన్షన్ పెడుతున్నాయి.
సాధారణంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్లాన్ ప్రకారం చిత్రీకరణ జరుపుతూ యూనిట్ సభ్యులనుంచి కనీసం మొబైల్ కూడా సెట్ లోపలకి అనుమతించడం లేదట. అయినా ఎలా షూటింగ్ కి సంబంధించిన విషయాలు లీకవుతున్నాయో తెలియడం లేదు. ఇకపై కూడా ఇలాగే కల్కి సినిమా నుంచి లీకులొస్తే ఖచ్చితంగా మేకర్స్‌కి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ఇలాంటి లీకులే నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.