Wed. Jan 21st, 2026

    Nawazuddin: సెలబ్రిటీల మధ్య వివాహ బంధాలు అంత సక్రమంగా ఉండవనే సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల వైవాహిక బంధాలు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే గదా కొంతకాలంగా బాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నవాజుద్దీన్ సిద్ధిఖ్, అతని మాజీ భార్య అంజన పాండేకి మధ్య వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా అంజనా పాండే మీడియా ముందుకు వచ్చి నవాజుద్దీన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటుంది. అతనిపై ఆరోపణలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటుంది. గత నెలలో నవాజుద్దీన్ ఇంటి ముందుకు వచ్చి ఆమె రచ్చ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది.

    Nawazuddin Siddiqui breaks silence on ex-wife's claims, says Aaliya 'only  wants money' - News Live

    నవజుద్దీన్ తనని రోడ్డు మీదకి గెంటేసాడని, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదంటూ వీడియో చేసింది. ఆ వీడియో చూసిన అందరూ కూడా నిజమైని నమ్మి నవాజుద్దీన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. తర్వాత ఆ ఘటనపై ఈ స్టార్ నటుడు క్లారిటీ ఇచ్చాడు. తన భార్యతో తనకి విడాకులు అయ్యి చాలా సంవత్సరాలు అవుతుందని తెలిపాడు. ఇదిలా ఉంటే తాజాగా నవాజుద్దీన్ తన భార్యతో పాటు సంషుద్ధిన్ అనే మరో వ్యక్తిపై ఏకంగా 100 కోట్ల పరుగుల నష్టం దావా వేశారు.

    తన మాజీ భార్య అంజన పాండే తరచుగా సంషుద్ధిన్ అనే వ్యక్తితో కలిసి సోషల్ మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం ఉందని పేర్కొన్నారు. తన పరువుకి భంగం కలిగించే వారి చర్యలను ఆపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బహిరంగంగా వాళ్ళిద్దరితో తనకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. తన పరువుకి భంగం కలిగించినందుకు ఏకంగా 100 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అంజన పాండే ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.