Wed. Jan 21st, 2026

    Nagula Chavithi: శ్రావణమాసం రావడంతో పెద్ద ఎత్తున పండుగలు శ్రావణమాసంలో వచ్చే చతుర్దశి రోజున చాలామంది నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఈ పండుగ ఆదివారం జరుపుకోనున్నారు. ఇలా నాగల చవితి రోజు చాలామంది పెద్ద ఎత్తున నాగదేవత విగ్రహాలకు పాలు పోసి నైవేద్యం సమర్పించి పూజించగా మరికొందరు పుట్టకు వెళ్లి పాలు పోసి ఈ పండుగను జరుపుకుంటారు. అయితే నాగుల చవితి రోజు ఎలా పూజ చేయాలి ఏంటి అనే విషయానికి వస్తే…

    నాగుల చవితి రోజు ప్రతి ఒక్కరు కూడా పుట్టకు వెళ్లి పుట్ట దగ్గర శుభ్రం చేసి నీళ్లు చెల్లి ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అనంతరం పుట్ట కలువలలోకి చలివిడి బియ్యపు పిండి పాలు గుడ్లు వంటివి వేస్తారు. అనంతరం మనం తీసుకెళ్లిన పండ్లు నైవేద్యం పుట్టకు సమర్పించి ప్రత్యేక పువ్వలతో అలంకరించి పూజిస్తారు.ఇలా చేయడం వల్ల సర్వ దోషాలు,రోగాలు తొలగిపోతాయని భావిస్తారు. ఇక ఈరోజు మహిళలు ఉపవాసంతో ఈ పూజను నిర్వహిస్తారు.

    Nagula Chavithi

    ఇక సర్ప దోషంతో బాధపడేవారు నాగల చవితి రోజున పుట్టలోకి వెండి నాగ పడగలను వదిలి పుట్టలో పాలు పోసి ఆరోజు ఉపవాసం ఉండి నాగదేవతలను పూజించడం వల్ల నాకు సర్ప దోషాలు తొలగిపోతాయి అయితే కొందరు ఈ పండుగను చవతి పంచమి రెండు రోజులపాటు జరుపుకోగా మరికొందరు ఒకరోజు మాత్రమే జరుపుకుంటారు. కొందరు నాగుల చవితి రోజు నుంచి ఉపవాసం ఉండి పంచమి రోజున ఉపవాసం వదులుతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు.