Mouth Wash: సాధారణంగా చాలామంది దంతాలను సంరక్షించుకోవడం కోసం నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉదయమే బ్రష్ చేయడంతో పాటు మౌత్ వాష్ కూడా ఉపయోగిస్తూ నోటిని శుభ్రపరచుకుంటూ ఉంటారు. ఈ విధంగా మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల దంతాలను సంరక్షించుకోవడమే కాకుండా నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వారు అవుతామని అందరూ భావిస్తుంటారు కానీ మౌత్ వాష్ అధికంగా వాడటం వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దంత నిపుణులు చెబుతున్నారు.
మౌత్ వాష్ ప్రతిరోజు ఉపయోగించడం వల్ల అందులో ఉన్నటువంటి ఆల్కహాల్ మన పళ్ళు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది దంతాలను కాపాడే క్రమంలోనే దంతక్షయాన్ని కలిగిస్తాయని అలాగే పళ్ళు మొత్తం పసుపు రంగులో మారుతాయని వెల్లడించారు. మౌత్ వాష్ లో ఉండే కెమికల్స్ వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయని అంటున్నారు. కాబట్టి మౌత్ వాష్ వాడకానికి సంబంధించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మౌత్ వాష్ తరచూ వాడటం వల్ల దంతాలు కూడా గరుకుగానూ, బలహీనంగానూ ఉంటాయి. కాబట్టి మార్కెట్ లో లభించే రసాయనాలు కలిపిన మౌత్ వాష్ కు బదులు సహజసిద్ధమైన మౌత్ వాష్ ను తయారు చేసి వాడుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు. దంత సంరక్షణ కోసం క్రమం తప్పకుండా బ్రషింగ్, ఇంటర్ డెంటల్ క్లీనింగ్, డెంటల్ చెకప్‌లు చేయడం వల్ల దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యలు కొందరిలో జాగ్రత్తలు తీసుకోవాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.