Wed. Jan 21st, 2026

    Devotional Tips: సాధారణంగా మనం ఒక వైపు మన ఇష్టదైవాన్ని ఆరాధిస్తూనే మరోవైపు కొన్ని వాస్తు శాస్త్రాలను అలాగే పండితులు చెప్పే వ్యాఖ్యలను పెద్దగా నమ్ముతూ ఉంటాము. ఈ క్రమంలోనే చాలామంది ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఎన్నో పద్ధతులను పాటిస్తూ బయటకు వెళ్తుంటారు. వారు బయటకు వెళ్లే ముందు అదృష్టం బాగా కలిసి వచ్చిన వారిని ఎదురు రమ్మని చెబుతూ ఉంటారు అలాగే దారిలో ఎవరు కూడా లేకుండా ఉన్నప్పుడే బయలుదేరుతారు అలాగే సరైన సమయం చూసుకొని బయలుదేరుతూ ఉంటారు.

    morning-spoon-curd-is-good-for-works-saying-hindu-pandit
    morning-spoon-curd-is-good-for-works-saying-hindu-pandit

    ఇలా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ పని దిగ్విజయంగా పూర్తి కావాలని దేవుళ్ళను ప్రార్థిస్తూ వెళ్తూ ఉంటాము. అయితే ఈసారి ముఖ్యమైన పనుల నిమిత్తం ఉదయమే పరగడుపున కనుక మీరు బయటకు వెళ్తున్నారు అంటే తప్పనిసరిగా ఈ చిన్న పని చేసే వెళ్లడం వల్ల అనుకున్న పని దిగ్విజయంగా పూర్తి అయ్యి ఎంతో సంతోషంతో ఇంటికి వస్తారు మరి ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే..

    ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళుతున్నటువంటి సమయంలో కాస్త పెరుగులోకి చక్కెర కలిపి ఆ పెరుగును తిని వెళ్ళటం వల్ల మీరు చేయబోయే పనులలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు ఆ పని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుని వస్తారు. అది శుభకార్యమైన భూ వివాదాలు వంటి వాటివి అయినా కోర్టు వ్యవహారం అయినా కూడా తప్పనిసరిగా మీ పనులు విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు.